#


Index

దైవాసుర సంపద్విభాగ యోగము

  ధనమూల మిదం జగత్తని ఆనాడు ఎప్పుడు చెప్పారో పెద్ద లిప్పుడు కూడా అది పరమ సత్యమే. భీష్ముడిలాంటి వాడే ఏమన్నాడో తెలుసు గదా మహాభారతంలో. అర్థస్య పురుషోదాసః - దాసస్త్వర్థోన కస్య చిత్. డబ్బుకు అందరూ బానిసలే. డబ్బు మాత్ర మెవరికీ బానిస కాదన్నాడు. అంటే ఏమని అర్థం. అచేతనమైన ద్రవ్యం చేతనుడైన మానవుణ్ణి తనకు వశం చేసుకొని వాడి నెత్తినెక్కి తొక్కుతున్నదా. వీడు దాని క్రింద పడి నలిగి చస్తున్నాడా. ఎంత సిగ్గులేని బ్రతుకీ మానవుడి బ్రతుకు. ఇంతకన్నా పశు పక్ష్యాదులెంతో దర్జాగా బ్రతుకుతుంటాయి. ఎప్పటి కెంత కావాలో అంతే పోగు చేసుకొంటాయి. తింటుంటాయి. తిరుగుతుంటాయి. అంతకు మించి లక్షలు చేతికిచ్చినా వాటి మొగం చూడవు. అవతల పారేస్తాయి. అది చూచి అయినా బుద్ధి తెచ్చుకోవచ్చు ఈ మానవుడు. అలా ఎందుకు తెచ్చుకొంటాడు. తెచ్చుకోనిస్తే గదా వీడికి పట్టిన ఈ ఆశాపిశాచి.

ఇదమధ్య మయాలబ్ధ మిదం ప్రాప్స్యే మనోరథమ్
ఇద మస్తీద మపిమే - భవిష్యతి పునర్థనమ్ - 13

  ఇది ధన సంపాదనా లాలసులైన వ్యాపారస్థుల విషయమైతే అంతవరకే గాక అంతకుమించిన ఉన్నత పదస్థులైన మానవుల విషయమేకి పారేస్తున్నాడు వ్యాసభట్టారకుడు. ఇద మద్యమయా లబ్ధం - ఇదుగో ఇంత దాకా ఇంత ఆస్తి పాస్తులు సంపాదించి ఇన్ని విధాల సుఖ సౌకర్యాలను

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు