గారంటీ లేదు. కొన్ని తీరితే కొన్ని తీరవు. పురుషుడు తీరాలనే చూస్తాడు. కాని ప్రకృతి తీరనివ్వదు. తీరకపోయే సరికి ఎక్కడ లేని కోపం. ఎవరి మీద. ప్రకృతి మీదనా. దానినేమి చేయగలడు. అది అచేతనం. నీవెంత గుడ్లురిమి చూచినా అది భయపడదు. భయపడక పోగా నిన్నింకా భయపెడుతుంది. అవే గదా జీవితంలో మనకు తరుచుగా ఎదురయ్యే ఉపద్రవాలన్నీ. తస్మా దపరిహార్యే అని మనకు మనం సమాధానం చెప్పుకోవలసిందే గాని వాటినేమి చేయగలం.
జడ ప్రకృతినేమి చేయలేక పోయేసరికి చేతనులైన తోడి మానవులు కనిపిస్తారు వీరికి. వీరివల్లనే తమ పని భంగమయిందని చెప్పి వారి మీద మండి పడతారు. వారూ తమలాగే భంగపడే బాపతే నని భావించరు. అంతేకాదు. ఈహంతే కామ భోగార్ధం అంత కంతకింకా తమ కోరికలు తీర్చుకోవాలని అందరికన్నా ఎక్కువగా సుఖపడాలనీ ఆసిస్తుంటారు. అన్యాయే నార్థ సంచయాన్. అందుకోసం ఎన్ని అక్రమాలైనా అత్యాచారాలైనా చేయటానికి వెనుదీయరు. న్యాయమో అన్యాయమో. మొత్తం మీద వారికి కావలసింది ఆస్తులూ పాస్తులూ డబ్బూ డాలకం పోగు చేసుకోటమే.
ఇప్పుడిదంతా మహర్షి ఏకరువు పెడుతున్నాడంటే ఏమనుకొంటున్నారు మీరు. ఎవరి జీవిత మనుకొంటున్నారు. ఎవరో ద్వాపరయుగం వారి దనుకొంటున్నారా. కాదు. ఆ ముసుగులో దాగి ఉన్న