#


Index

దైవాసుర సంపద్విభాగ యోగము

చింతా మపరి మేయాం తాం ప్రలయాంతా ముపాశ్రితాః
కామోపభోగ పరమాః - ఏతావదితి నిశ్చితాః - 11

  ఇలాటి చెడు బుద్ధి ఉంటే ఏమవుతుంది చింతా మపరిమేయాం అమితమైన చింతతో సతతమతమై పోతుంటారు. ఎప్పుడూ మనసులో ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు. ప్రణాళికలు - అవి ఎలా అమలుపరచాలా అని ఆందోళనలు - ప్రళయాంతా ముపాశ్రితాః - అవి నెరవేరితే సరే. నెరవేరలేదో నిద్ర పట్టి చావదు. మనసు స్తిమితత కోలుపోతుంది. ఎంత మనసైనా అదీ ఒక యంత్రమే. కొంతవరకే పనిచేస్తుందది. దాని కెపాసిటీని మించి ఆలోచిస్తూ పోతే చివరకది చెడిపోతుంది. చీలిపోతుంది. హెమరేజి వచ్చి హఠన్మరణానికైనా దారి తీస్తుంది. దానితో నడమంతరంగానే నశించి పోతారు అలాటి మానవులు.

  కారణం. కామోప భోగ పరమాః - అడ్డదారిలో తమ కోరికలను భవించాలని అడ్డదిడ్డంగా ప్రవర్తించటమే కామోప భోగమే జీవిత లక్ష్యం వారికి. ఏతా వదితి నిశ్చితాః ఇంతకు మించి మనం సాధించవలసింది ఇక ఏదీ లేదని వారి నిశ్చయం. అయమేవ పరమః పురుషార్ధః యః కామోప భోగః - ధర్మం కాదు మోక్షం కాదు పురుషార్ధం. తాము కోరింది అనుభవిస్తూ పోవటమే పరమ పురుషార్ధమని భావిస్తుంటారని చాటుతున్నారు భగవత్పాదులు. చచ్చే వరకూ ఇలా కామాను భవమే ధ్యేయంగా భావించి

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు