#


Index

దైవాసుర సంపద్విభాగ యోగము

  పోతే ఇలా ఊహా గానాలతో కూడిన వీరి జీవితమెలా ఉంటుంది. ఎలా ప్రవర్తిస్తారో ఇక చెప్పనక్కర లేదు. ఏతాం దృష్టి మవష్టభ్య - ఇలాటి లోకాయత దృష్టినే పరమార్ధమని దాన్నే గట్టిగా పట్టుకొని నష్టాత్మావః మిగతాదంతా పోగొట్టుకొని బ్రతుకుతుంటారు. మిగతాదంటే ఏమిటది. పరలోక సాధన మంటారు స్వామివారు. ఇహం తప్ప పరమే లేదు గదా వీరికి. అంచేత బ్రతికినంత కాలమూ ఐహిక భోగాలను భవిస్తూ కూచుంటే చాలు. పరచింతే అక్కర లేదు.

  పోనీ ఐహికమైనా ఉంది గదా ఆముష్మికం లేకపోతే నేమంటారా. అల్ప బుద్ధయః - విషయ విషయా బుద్ధిః అంటారు భాష్యకారులు. విషయి చింత ఉంటే ఆముష్మికం. అటు ధర్మమో ఇటు బ్రహ్మమో ఏదైనా సరే. అది లేకుండా కేవలం విషయ ప్రపంచానికి సంబంధించిన విచారమే అయితే అది చాలా అల్పం పరిమితం. జననంతో ఆరంభమయి మరణంతో సమాప్తమయ్యేదది – పరిమితం గాక పరిపూర్ణమెలా అవుతుంది. జీవితం ఎంతకాల మనుభవించినా మరణించే వరకే గదా. ఆ తరువాత ఏమనుభవిస్తారు. తరువాత కూడా జీవితమొకటి ఉందనే నమ్మకమే లేదు వాడికి. నమ్మకం లేక అది కోలుపోయాడు. నమ్మి ఇది కోలుపోయాడు.

  అయినా చస్తే అంతా పోతుందనే ఆలోచనే లేక బ్రతుకు సాగిస్తుంటారు వారు. ఎలాగ. ప్రభవం త్యుగ్ర కర్మాణః - అతి దారుణమైన

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు