మలా జరగటం మూలాన్నే సృష్టి జరిగింది. కామం వల్ల క్రియా క్రియ వల్ల ఫలం అంతకన్నా ఏముంది లోక వ్యవహారం. ఆ మాటకు వస్తే నీవు చెప్పే ఈశ్వరుడు కూడా తన పాటికి తాను స్వతంత్రంగా చేశాడా ఈ సృష్టి. సోకామయత. అని మీ శాస్త్రమే చాటుతున్నది. వాడు తన మాయాశక్తితో రమిస్తేనే గదా సృష్టి చేయగలిగాడు కిమన్యత్. అంతకన్నా ఏముంది. అది దృష్టమైన ప్రాణుల సంయోగంలోనే మనకు దాఖలా అవుతున్నప్పుడది వదిలేసి అదృష్టమైన ఒక ఈశ్వరుడూ వాడి ప్రకృతీ అని రెండు భావాలను అనవసరంగా కల్పించటం దేనికి. ఇదీ వీరి సిద్ధాంతం.
దీన్నే లోకాయతిక దృష్టి రియమ్ లోకాయతులైన చార్వాకుల దృష్టి అని పేర్కొంటున్నారు భాష్యకారులు. లోకాయతు లంటే నాస్తికులు. వారికి ధర్మం లేదు. మోక్షం లేదు. అర్థ కామాలే నమ్ముతారు వారు. దృష్టమే నమ్ముతారు గాని అదృష్టాన్ని నమ్మరు. దృష్టం కూడా బ్రతికి ఉన్నంత వరకే. కన్ను మూస్తే ఇదీ లేదని వారి సిద్ధాంతం. ప్రత్యక్షమే వారికి ప్రమాణం. సుఖమే స్వర్గం. దుఃఖమే నరకం. మరణమే చివరకు మోక్షం. ఇంతకు మించి మరేదీ లేదు వాస్తవంలో. ఏదో ఉందని చెప్పినా అది కేవలం ఊహా గానమే.
ఏతాం దృష్టి మవష్టభ్య- నష్టాత్మానో ల్ప బుద్ధయః
ప్రభవం త్యు గ్ర కర్మాణః క్షయా య జగతో ఽ హితాః - 9