#


Index

దైవాసుర సంపద్విభాగ యోగము

వలసి ఉంటుందీ మానవుడంటారా. అదీ అబద్ధమే. ఇహమే లేదంటుంటే పరమా. అది అసలే అసత్యం. అప్రతిష్ఠం కూడా. మనమక్కడికి వెళ్లి అందులో చేరి పోవటం కూడా అబద్ధమే. ప్రతిష్ఠ అంటే ఆశ్రయం. గమ్యం. గమ్యమే లేదు జీవితాని కంటారు వారు. మరి ఈశ్వరుడో. దీనినంతా సృష్టించినవాడూ దీని స్థితిగతులను చూచేవాడూ ఒకడుండాలి గదా అని అడిగితే అనీశ్వరం. అసలాలాటి ఆధాయకుడూ విధాయకుడూ ఎవడూ లేడు పొమ్మంటారు.

  అయితే ఈ ప్రపంచమెలా ఏర్పడింది. నీవసలీ ప్రపంచం లోకి ఎలా వచ్చావు. కారణం లేకుండా కార్యమనేది రాదు గదా. అలాంటప్పుడీ ప్రపంచానికి కారణమేమిటి. అదే గదా మేమీ శ్వరుడంటున్నామని నీవు నిలదీస్తే దానికీ తడుముకోకుండా సమాధానమిస్తారు. అపరస్పర సంభూతం కి మన్యత్ కామహైతుకం. ఇదీ వారి వాదం. ప్రపంచం కార్యమే ప్పుకొంటాము. ఇది కార్యమయినప్పుడు దీనికొక కారణమంటూ ఉండాలి. అదీ అంగీకరిస్తాము. కాని ఆ కారణం మీరు భావించే ఈశ్వరుడు కాదు. మరేమిటి. అపరస్పర సంభూతం. స్త్రీ పురుషులు పరస్పరం కలుసుకోటం వల్ల ఏర్పడిందిది. వారెందుకు కలుసుకొన్నారు. కామ హైతుకం. కామమనేది వారి నలా కలుసుకోమని ప్రేరణ చేసింది. తన్నిమిత్తంగా వారికి సంయోగ మేర్పడింది. అనులోమ ప్రతిలోమ సంయోగ

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు