బ్రహ్మమంటే ఏమిటి. సత్య స్వరూపమది. సత్యం జ్ఞాన మనంతమని దాని లక్షణం. సత్యమంటే దేశకాలాదులన్నీ వ్యాపించి ఎప్పుడూ ఉన్న పదార్ధం Omini present అది. నిరాకారం గనుక వ్యాపకం. వ్యాపకమంటే చరాచర పదార్థాల ఆదిమధ్యాంతాలు మూడింటిలోనూ గనుక అనంతం. అప్పుడది మన స్వరూపమూ మనం చూచే ప్రపంచ స్వరూపం కూడా కావలసి ఉంటుంది. ఇక మనకు బంధమే ముంది. ముక్తులమే మనం సత్యమంటే.
మరి ఇలాటి గొప్ప సత్యాన్ని గుర్తించ లేకపోతున్నారంటే ఏమి చెప్పాలి వారి మూఢత్వం. ధర్మానికే నోచుకోని బుద్ధులు మోక్షానికెలా నోచుకోగలవు కాకపోయినా. అందుకేన సత్యం తేషు విద్యతే. సత్య స్వరూపమైన బ్రహ్మం వారి మనస్సులలోనే లేదు. లేదంటే వస్తు సిద్ధంగా దాని పాటికది ఉన్నా వారికది ఉన్నట్టు ఏమాత్రమూ స్ఫురణకు రాదు.
అలా రాకపోయే సరికసలా బుద్ధులిక ఎన్నెన్ని పాట్లు పడుతుంటాయో ఎన్ని పెడదారులు తొక్కుతూ పోతాయో చెప్పేదేముంది. అసత్య మప్రతిష్ఠంతే జగదాహు రనీశ్వరం. అసలీ ప్రపంచమే లేదు. మనం చూస్తున్నప్పుడే ఇది సత్యం. ఉన్నదను కొంటున్నాము. దీనితో వ్యవహరిస్తున్నాము. చస్తే ఏదీ సత్యం కాదు. మరణంతో ఆఖరు కాదు మన ప్రయాణం మరలా ఒకటేదో ఉంది దీనికి మూలం. అక్కడికి వెళ్ల