#


Index

దైవాసుర సంపద్విభాగ యోగము

ఆముష్మికం. అది ఇహానికైతే ఇది పరానికి చెందినది. ఇందులో మరలా రెండున్నాయి. అదే ధర్మం. బ్రహ్మమని పేర్కొన్నది.

  ఇందులో ధర్మం మరలా జన్మ ఉందని అది ఇప్పుడు మనం చేసుకొనే ఇంతకు ముందు చేసిన పుణ్యపాప కర్మలను బట్టి వస్తుందని అందుకే మంచి చేసుకొని స్వర్గ సుఖమను భవించి తరువాత ఉత్తమ జన్మ ఎత్తగలవని పాపం చేస్తే మాత్రం నరకానికి పోయి నానా యాతన లనుభవించి ఆ తరువాత నికృష్టమైన పశుపక్ష్యాది జన్మ లెత్తవలసి వస్తుందని ఇలా చిలువలు పలువలు పెట్టి వర్ణిస్తుంది. పుణ్యా పుణ్య కర్మలలో ప్రవర్తించే వ్యవహారం కాబట్టి దీనికి ప్రవృత్తి ధర్మమని పేరు వచ్చింది.

  పోతే రెండవది బ్రహ్మం. అది కేవలం జ్ఞానానికి సంబంధించినది. కర్మకు చెందిన పురుషార్ధం కాదు. ఎందుకంటే అది ధర్మంలాగా సాధ్యం కాదు. సిద్ధం. అలాంటి బ్రహ్మ తత్త్వాన్ని మానవుడు తన స్వరూపమే నని గుర్తించి దానినే సర్వత్రా విస్తరించి ఉన్నట్టు భావిస్తే చాలు. ఇక ఏ ప్రయత్నమూ లేదు. ఎక్కడికీ ప్రయాణమూ లేదు. ఏదీ క్రొత్తగా అయిపోనక్కర లేదు. అసలు లోకాంతరాలూ జన్మంతరాలూ లేవు. కనుకనే దీనికి నివృత్తి ధర్మమని పేరు పెట్టారు. నీవు తప్ప మరేదీ కనపడదు. కాబట్టి అన్నింటి నుంచీ తప్పించుకొంటావు. అదే మోక్షమని కూడా పేర్కొన్నారు పెద్దలు.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు