#


Index

దైవాసుర సంపద్విభాగ యోగము

  అంచేత మానవుడై పుట్టినందుకు చేతనైతే ఇటు మోక్ష ప్రదాయకమైన నివృత్తి ధర్మమో చేతకాని పక్షంలో అటు అభ్యుదయ దాయకమైన ప్రవృత్తి ధర్మమో సాగిస్తూపోవాలి జీవితాంతమూ. సాగించాలంటే వాటి స్వరూప సాధన ఫలాలనే మూడింటినీ శాస్త్రాచార్యోప దేశ మూలకంగా గ్రహించాలి. దైవ సంపద ఉన్నవాడైతే ఆ పని చేయగలడు. కాని ఇది అసుర సంపద. ఇలాటి ఆ సుర స్వభావమున్న వాడేమి చేయగలడు. అసలా బుద్ధే పుట్టదు. ప్రవృత్తించ నివృత్తించ జనా నవిదు రాసురాః - అందుకే చెబుతున్నాడు మహర్షి వారికేది ప్రవృత్తి ధర్మమో తెలియదు. ఏది నివృత్తి ధర్మమో అది అంతకన్నా తెలియదు. తెలుసుకొనే ఇచ్చే కలగదు వారికి.

  అంతేకాదు. న శౌచం నాపి చాచరో నసత్యం తేషు విద్యతే. అలాటి సంకల్పమే లేకుంటే ఇక దాని విషయంలో ప్రవేశించటమేముంది. ఆచరించటమేముంది. శౌచమూ లేదు వారికి. ఆచారమూ లేదు. ఇది ధర్మ పురుషార్ధానికి చెప్పిన మాట. శౌచమంటే ఇంతకు ముందే చెప్పాము. శరీర శుద్ధీ చిత్త శుద్దీ రెండూనని. ముఖ్యంగా చిత్తశుద్ధి. శుద్ధమైన మనస్సుకు గాని పరచింతన రాదు. చింతనే కరువైతే ఇక దాన్ని ఆచరించట మసలే అసంభవం. కనుక ధర్మ పురుషార్ధానికే పనికిరారు వారు.

  అలా ధర్మానికే పనికిరాక పోతే ఇక మోక్షానికా. న సత్యం తేషు విద్యతే. మోక్షమనేది బ్రహ్మమనేది ఏమిటో తెలిసినప్పుడే. మరి

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు