#


Index

దైవాసుర సంపద్విభాగ యోగము

మానవులందరి గుట్టుమట్లూ నట్ట నడివీధిలో బెట్టి కడిగి పారేస్తున్నాడా మహర్షి అనిపిస్తుంది మనబోంట్లకు.

ప్రవృత్తించ నివృత్తించ- జనాన విదు రాసురాః
నశౌచం నాపి చాచారో - నసత్యం తేషు విద్యతే - 7

అసత్యమ ప్రతిష్ఠం తే- జగదాహు రనీశ్వరమ్
అపరస్పర సంభూతం- కిమన్యత్కామ హైతుకమ్ - 8

  ప్రవృత్తించ నివృత్తించ. ప్రవృత్తి నివృత్తి అని ఆముష్మిక పురుషార్ధాలు రెండు. ఒకటి ధర్మం. అది ప్రవృత్తి. మరొకటి బ్రహ్మం. అది నివృత్తి. పురుషార్ధమంటే పురుషుడు లేదా మానవమాత్రుడు కోరవలసినవి. అవి నాలుగైతే అందులో ఐహికం రెండు ఆముష్మికం రెండు అని విభజించారు పెద్దలు. ఇహానికి సంబంధించిన దైహికం. అర్థం కామ మలాంటివి. కావలసిన వన్నీ పోగు చేసుకోటం. అవి అనుభవిస్తూ కూచోటం. సామాన్యులకు తెలిసినంత వరకూ ఇదే పురుషార్ధం. ఇందులోనే త్రికరణాలతో ప్రవర్తిస్తుంటాడు మానవుడు. అంచేత ఇది ప్రవృత్తి అయింది. కాని ఇది పుట్టినప్పటి నుంచి చచ్చేదాకానే ఈ అనుభవం. ఆ తరువాత జవాబు చెప్పదు. పనికిరాదు. పోతే చచ్చిన తరువాత మనమే మవుతాము. ఎక్కడికి పోతాము. మరలా మనకు జన్మ ఉందా లేదా అని ఎప్పుడూ మన కన్వేషణే. దానికి జవాబు చెప్పటానికే మరి రెండు వచ్చాయి. అవే

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు