#


Index

దైవాసుర సంపద్విభాగ యోగము

విస్తారమని సూచించటానికే అధ్యాయంలో అసుర సంపదనే దైవ సంపద కంటే చాలా అధికంగా వర్ణించబోతాడు. అసలు మహా భారతంలో కూడా పాండవుల సైన్యం ఏడ క్షౌహిణులే అయితే కౌరవ సైన్యం పదకొండ క్షౌహిణులు. అది కూడా అసుర సంపదకున్న ఆధిక్యాన్ని సూచిస్తుంది మనకు. అందులో కూడా ఒక మర్మముంది అలా వర్ణించటంలో. కౌరవ సైన్యమెంత ప్రబలంగా పైకి కనిపించినా కృష్ణ పరమాత్మ సాన్నిధ్యాన్ని కోలుపోవటం మూలాన చాలా దుర్బలమై చివరకు సర్వ నాశనమయి పోయింది. మరి పాండవ సైన్యం దానికన్నా తక్కువే కావచ్చు. భగవత్సాంగత్య మెడబాయని కారణంగా సంగ్రామంలో చివరకు విజయాన్నే సాధించగలిగింది. ఇది దైవ గుణ సంపన్నులకు ప్రాప్తించే జీవిత సంగ్రామ విజయమే మరేదీ గాదు. ప్రస్తుత మిలాటి దృష్టితోనే వ్యాస భగవానుడసుర సంపదనే ఇక ఈ అధ్యాయం పూర్తి అయ్యేవరకు చిలువలు పలువలు పెట్టి వర్ణిస్తూన్నాడు. అది కూడా ఆయా గుణాలను గాక అలాటి గుణాలెవరి కుంటాయో అలాటి వ్యక్తులనూ వారి హావ భావాలనూ కండ్లకు కట్టినట్టు ప్రదర్శిస్తాడు. చెప్పాము గదా ఏ గుణమైనా ద్రవ్యాన్ని ఆశ్రయించే ఉంటుందని. అంచేత వ్యక్తులను వర్ణిస్తే వారి గుణాలను వర్ణించినట్టే. సజీవమైన వ్యక్తుల వర్ణన కాబట్టి అది ఇంకా సజీవంగా మనస్సుకు భాసిస్తుంది. మొత్తం మీద ఈ వర్ణనలో ప్రపంచ

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు