#


Index

దైవాసుర సంపద్విభాగ యోగము

ఇంకొకరు రాక్షసులూనట. ఇది ఒక అర్థవాదం. ఇందులో చాలా గొప్ప అంతరార్థముంది. ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడని గాదు. బ్రహ్మదేవుడు మానవుడి బుద్ధే. చతుర్ముఖుడది. నాలుగు ముఖాలుంటాయి దానికి. మనో బుద్ధి చిత్తాహంకారా లనేవి అవే. లేదా నాలుగు వైపులా చూడగలదని కూడా చెప్పవచ్చు. హిరణ్యగర్భుడది. హిరణ్యం దాని గర్భంలో ఉంది హిరణ్యమంటే బంగారం. తేజస్సు ప్రకాశమని లక్ష్యార్ధం. ప్రకాశం జ్ఞానమే. అది బుద్ధిలోనే ఉందా జ్ఞాన ప్రకాశం. అంతేకాదు. అదే ప్రజాపతి కూడా. ప్రజాయంతే ఇతి ప్రజాః - జన్మించే దని అర్థం. అదే ప్రాణం. జీవం. సమష్టి జ్ఞానమూ సమష్టి ప్రాణమూ గదా బ్రహ్మదేవుడని శాస్త్రం వర్ణించింది. Cosmic Life and Cosmic Mind. జ్ఞానముంటే ప్రాణముంది. ప్రాణముంటే జ్ఞానముంది. అన్యోన్యాశ్రయమవి. రెండూ ఒకటే నంటుందుప నిషత్తు. యావై ప్రజ్ఞా సప్రాణః యోవై ప్రాణ స్సా ప్రజ్ఞా అని శ్రుతి వాక్యం. అంచేత బుద్ధి ప్రాణ సమష్టే ప్రజాపతి. లేదా ప్రాణి జన్మకు సంకల్పమే మూలం కాబట్టి ప్రజాపతి బుద్ధే కావచ్చు. ప్రజాపతి బ్రహ్మే కానక్కర లేదు. కశ్యపుడు కూడా ప్రజాపతే. పశ్యక అను శబ్దమే కశ్యపగా మారిందని చెబుతారు శబ్ద శాస్త్రవేత్తలు. కశ్యప అంటే అప్పటికి సర్వతో ముఖంగా చూచేవాడని అర్థం అది బుద్ధే మరేదీ గాదు. దాని సంతానమే దేవతలూ రాక్షసులూ. కశ్యపజ్రాపతి సంతానం దేవ దానవులంటే అర్థం

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు