#


Index

దైవాసుర సంపద్విభాగ యోగము

ద్వౌ భూత సర్గా లోకేస్మిన్ - దైవ ఆసుర ఏవచ
దైవో విస్తరశః ప్రోక్త - ఆసురం పార్థమే శృణు - 6

  ఇంతకూ చెప్పవచ్చే దేమంటే ద్వౌ భూత సర్గా లోకస్మిన్ దైవ ఆసుర ఏవచ. రెండే రెండు విధాలీ లోకంలో మానవుల సృష్టి. భూతమంటే ఇక్కడ ప్రాణులన్నింటినీ చెప్పటం లేదు. మానవులనే ప్రాణులనే పేర్కొంటున్నారు. కారణం తనకీ సంపద ఉన్నదని గుర్తించే వాడూ గుర్తించి అది ఆసురమైతే దానికి స్వస్తి చెప్పి దైవికంగా మార్చుకోవలసిన వాడూ లేక దైవ సంపదతోనే జన్మిస్తే దానినంత కంతకు వృద్ధి చేసుకొని తరించ వలసిన వాడూ మానవుడే గదా. వాడే ధర్మానికి గాని జ్ఞానానికి గాని అధికారి అని చాటుతున్న దుపనిషత్తు. దానినే అనువదించి చెబుతున్నది గీత. అది గ్రహించే భూత శబ్దానికి మానుష్య అని అర్థం చెబుతున్నారు భాష్యకారులు.

  ఏమిటా సంపదలు రెండూ. దైవమొకటి. ఆసురమొకటి. మొదట రాక్షస మని మరకొటి కూడా చెప్పాడు గీతాచార్యుడు. ఇప్పుడు మూడు కావు రెండే నంటున్నాడు తేడా రాదా అంటే రాదు. కారణం రాక్షసమనేది కూడా ఆసురంలో చేర్చి రెండుగానే పరిగణిస్తున్నాడు. ఉపనిషత్తు కూడా రెండేనంటుంది. ద్వయా హ వై ప్రాజా సత్యా దేవాశ్చ అసురాశ్చేతి. ప్రాజాపత్యులంటే ప్రజాపతి సంతానం. ఇద్దరే వారు. ఒకరు దేవతలూ

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు