విమర్శ జ్ఞానం పనిచేయవచ్చు. దానికి జీవితంలో బాగా దెబ్బలు తగలటమో సమయాని కెవరైనా మహాత్ములు తటస్థపడి అపమార్గం నుంచి తప్పించి సరియైన మార్గానికి మళ్లించటమో జరిగితే ఏర్పడుతుందాసక్తి. అది విమర్శకు దారి తీసి శ్రవణాదులు చేయిస్తుంది. అయితే చాలా అరుదైన సందర్భమిలాంటిది. మొత్తం మీద మానవుడయి పుట్టినందుకు మనసనేది ఉన్నందుకు అది ఒకవేళ ప్రతిలోమంగా పనిచేసినా అనులోమంగా దాన్ని మలుచుకోటాని కెప్పుడూ ఉంది అవకాశం. అయితే అసుర సంపద ఉన్నవాడు శ్రమ పడవలసినంతగా దైవ సంపద ఉన్నవాడు పడనక్కర లేదు.
అందుకే హామీ ఇస్తున్నాడు పరమాత్మ అర్జునుడికి మా శుచః సంపదం దైవీ మభిజాతోసి. నీవేమీ భయపడ వద్దు అర్జునా. దైవసంపదతోనే జన్మించావు నీవంటాడు. నేనీ రెండింటిలో ఏ సంపదతో జన్మించానా అని తేల్చుకోలేక పోతున్నాడర్జునుడు. అందుకే భగవానుడు తేల్చి చెబుతున్నాడు. అర్జునుడ జ్ఞానం వల్లనో ఆత్మ విశ్వాసం లేకనో లేదా తానెందుకు బయటపడటం - బావగారే ఏమి చెబుతారో విందా మనే ఊరుకోవచ్చు. ఏదైతేనేమి. బావగారి నోటే వచ్చింది తాను దైవగుణ సంజాతుడని. కాని అంతమాత్రాన ఆయన తనకు గొప్ప కితాబిచ్చాడని భావించరాదా మానవుడు. ఆయన తన జన్మ వరకూ హామీ ఇచ్చాడు గాని తరువాత