అలా సాధన చేస్తూ పోతేనే జన్మతః సంక్రమించిన ఆస్తిపాస్తులను కాపాడుకొని అభివృద్ధి చేసుకొని దాని ఫలితాన్ని జీవితంలోనే చవిచూడగలడు మానవుడు. అంతే గాని దైవసంపద మనకు జన్మ సిద్ధంగదా ఇంక చేయవలసిందే ముందని ఊరక కాలం గడుపుతూ కూచుంటే పొరబాటు.
అలాగే దీనికి భిన్నమైనది అసుర సంపద. నిబంధా యాసురీ మతా అంటున్నాడు. అసుర సంపద నిన్ను అంతకంతకు సంసారమనే బురదలో కూరుకుపోయేలా చేస్తుంది. తాళ్లతో కట్టి నట్లు కట్టి పారేస్తుంది. బయటపడనివ్వదు. ఒక గురువు దగ్గరికి వెళ్లుదామని గురు ముఖత. శ్రవణమననాదులు చేద్దామని తద్ద్వారా ఈ బందిఖానాలో నుంచి తప్పించుకొని బయటపడదామని బుద్ధే పుట్ట నివ్వదు. ప్రారబ్ధం నెత్తి నెక్కి తొక్కుతుంటుంది. ప్రయత్నాని కక్కడ అవకాశమే లేదు. అవకాశమున్నా ఉపయోగించుకొనే ఇచ్ఛ కలగనే కలగదు. అయితే ఒకటి. మానవుడి బుద్ధి రెండు మార్గాలలో పయనించగలదు. రెండింటికీ ఆసక్తి ప్రధానం. అది ప్రపంచ విషయాలలోనా పరమార్థ విషయంలోనా అనేది వారికి వారు గ్రహించవలసిన విషయం. దైవ సంపద అలా గ్రహించి ఆ మార్గంలో పయనించటాని కవకాశమిస్తుంది. అసుర సంపద ఇవ్వదు. కాని ఇవ్వదని ఊరక చేతులు ముడుచుకోరాదు. ప్రాప్తముంటే లోపల గుప్తంగా ఉన్న