వారు గుర్తించి సిగ్గు పడవలసిన విషయం. పోతే అతి మానమూ క్రోధమూ. ఇవి రెండూ ఇంతకు ముందే చెప్పాము గదా అంటారు భాష్యకారులు. అక్కడ దైవ గుణాలలో వీటికి వ్యతిరిక్తంగా చెప్పారర్ధం. దానికి వ్యతిరిక్తంగా ఇక్కడ చెప్పుకొంటే సరిపోతుందని ఆయన అభిప్రాయం. ఎలాగంటే అక్కడ నాతిమానిత అనేది దైవగుణమైతే ఇక్కడ అతిమానితా అనేది అసుర గుణం. అక్కడ అక్రోధం దైవమైతే ఇక్కడ క్రోధమనేది ఆసురం. ఇలాగా అర్థం చేసుకోవచ్చు మనం. పోతే అయిదవది పారుష్యం. పరుషమైన మాట. అది ఎలాటిదో వివరిస్తున్నారు భాష్యకారులు. కండ్లున్న వాడు కండ్లు లేని వాణ్ణి చూచి అందగాడు అందవికారంగా ఉన్నవాణ్ణి చూచి హెచ్చు కులంలో జన్మించినవాడు హీనకుల జాతుణ్ణి చూచి హేళన చేయట మంటారాయన.
పోతే అజ్ఞానమనేది ఇక ఆఖరిది. అజ్ఞానమంటే వివేక జ్ఞానం లేకపోవటం. వివేకమేమిటి. కర్తవ్యాకర్తవ్య విషయః మిధ్యా ప్రత్యయః అని అర్థం వ్రాస్తారు స్వామివారు. ఏది మనకు కర్తవ్యమో ఏది పనికిరాదో విమర్శించి చూడలేని భ్రాంతి జ్ఞానం. ఇదే అన్ని అనర్థాలకూ మూలమసలు. ఇది ఒక్కటి లేకుంటే చాలు. అసుర గుణాలన్నీ దైవగుణాలుగా మారుతాయి. ఉన్నదో దైవగుణాలన్నీ అసుర గుణాలే అవుతాయి. జ్ఞానా జ్ఞానాలలో ఉన్నది మొత్తం మానవ జీవితం. జ్ఞానమంటే