మహర్షి ఇక తిరుగేముంది. మరణంతో అంతా సమసిపోతున్నది గదా మరలా జన్మేమిటి. అది వస్తుందని గారంటీ ఏమిటని అడిగితే హేతు దృష్టాంతాలతో ప్రతిపాదిస్తుంది శాస్త్రం.
నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః అనేది హేతువు. ఉన్నది పోదు. లేనిది రాదు. ఇప్పుడీ జీవభావంతో మనం బ్రతుకుతున్నాము. ఇది ఉన్నట్టుండి మరణంతో పోయిందంటున్నావు. ఆకస్మికంగా ఎలా వచ్చింది. ఆకస్మికంగా ఎక్కడికి పోయిందని మా ప్రశ్న. అలా అన్నావంటే అకృతా భ్యాగమ కృతవి ప్రణాశాలనే రెండింటికీ నీవు జవాబు చెప్పలేవు. ఏ కర్మా ఇంతకు ముందు చేయకుండా జీవుడెలా జన్మించాడు. ఇప్పుడీ చేసిన కర్మఫలమను భవించకుండా ఎలా నశించి పోతాడు. కాబట్టి హేతువాదానికి నిలబడదు. అలాగే దృష్టాంతం కూడా ఉంది మన జీవితంలోనే. సుషేప్తే మనకు దృష్టాంతం. గాఢ నిద్రలో మనమే మయి పోయామో మనకే తెలియదు. వృత్తి రూపంగా ఏదీ బయటపడదు. అయోమయ స్థితి. మరణం లాంటిదే అది. కాని వాసనారూపంగా అన్నీ గుప్తమయి ఉంటాయి వృత్తులు. అలా ఉండకపోతే తెల్లవారి లేచి ఎలా ఆలోచించగలం. పనులెలా చేసుకోగలం. ముందు జరిగిన దాని అనుబంధమే Continuation గదా ఇవి. జరిగిన దాని స్మృతి ఏర్పడుతున్నదంటే వృత్తులు వాసన లయి వాసనలు మరలా వృత్తులుగా
Page 286