గొప్ప శ్రేయస్సుకు నోచుకొంటాడు. జీవితంలోనే గాక తరువాత రాబోయే జన్మలోనైనా అందుకోగలడు వాడు జీవిత గమ్యమైన నిశ్రేయసాన్నే. దానికి తగిన గుణమలవడి నప్పుడు తదను గుణమైన ఫలం కూడా సిద్ధించక పోదు. ఇంతవరకూ దైవ సంపద అంటే ఏమిటో సాంగోపాంగంగా వర్ణించాడు మహర్షి ఇక దీన్ని గురించి చెప్పవలసింది లేదు. పోతే ప్రస్తుతం పరిశేష న్యాయంగా రెండవదైన అసుర సంపద ఏమిటో అది ఎలాటిదో ఆవిష్కరిస్తున్నాడు. సవిస్తరంగా కాదు. సూచనా ప్రాయంగా పేర్కొంటున్నాడు. మొదట.
దంభో దర్పో తి మానశ్చ - క్రోధః పౌరుష్య మేవచ
అజ్ఞానం చాభి జాతస్య - పార్థ సంపద మా సురీమ్ - 4
దంభ మొకటి దర్ప మొకటి అతిమాన మొకటి క్రోధ మొకటి. పారుష్య మొకటి. అజ్ఞాన మొకటి. ఇవి ఆరూ అసుర గుణాలు. అభిజాతస్య సంపద మాసురీం. అసుర సంపదతో జన్మించిన వారికివి జన్మతోనే వస్తాయి. ఏదైనా జన్మతో వచ్చేదే. ఇంతకుముందు దైవ సంపదతో పుట్టిన వారి విషయమదే చెప్పాడు. ఇప్పుడూ అదే చెబుతున్నాడు. ముందు ఏ గుణమైనా జన్మతో వస్తుంది. తరువాత జీవితంలో వృత్తిగా బయటపడు తుంటుంది. చివర కవసానంలో అదే వాసనా రూపంగా మారుతుంది. అది మరలా మరణానంతరం జన్మకు కారణమవుతుంది. కారణం గుణ సంగోస్య సదసద్యోని జన్మను అని క్షేత్రజ్ఞాధ్యాయంలో చెప్పనే చెప్పాడు గదా