చేర్చుకొంటూ పోవచ్చునని భావం. అసలీ భావంతోనే ఉదాహరించి ఉంటాడు వ్యాసభగవానుడీ దైవ గుణాల నిరవయి ఆరింటినీ.
ఇవన్నీ భవంతి సంపదం దైవీ మభిజాతస్య. దైవసంపదతో పుట్టిన వాడికి కనపడతాయంటాడు. గుణమనేది స్వతంత్రంగా ఎక్కడా ఉండదని ఇంతకు ముందు సూచన చేశాము. ద్రవ్యాశ్రితో గుణః అని తార్కికులు చెప్పేమాట. ఏదో ఒక పదార్థాన్ని ఆశ్రయించి ఉంటుందే గుణమైనా. మంచితన మనేది ఒక గుణమనుకోండి. అది ఎక్కడ ఉందా గుణం. ఎక్కడ కనిపించింది నీకు. ఎక్కడో గాలిలో ఆకాశంలో లేదది. ఏదో ఒక వ్యక్తి లోనే కనిపించాలి. ఫలానా వాడు మంచివా డన్నావంటే నీకు కనిపిస్తున్న వాడా వ్యక్తి. కనపించకుండా ఉన్న దా మంచితనమనే గుణం. వ్యక్తిని చూస్తే వాడిలో ఉందని పోల్చుకొంటాము. ఎలాగా. వాడి ఆలోచనలో వాడి మాటల్లో వాడి ప్రవర్తనలో బయటపడు తుందది. అలాగే ఒక దోషం కూడా. గుణానికి గుణవంతు డాశ్రయమైతే దోషానికి దోషి అయిన వాడాశ్రయం.
ప్రస్తుతం దైవ సంపదను వ్యాసభగవానుడు వర్ణించాడంటే అలాటి దైవగుణ సంపన్నుణ్ణి వర్ణించాడని అర్థం చేసుకోవాలి. వాడలాటి దైవ సంపదతో జన్మిస్తాడని అర్థం. అంతేకాదు. అభిజాతుడంటే ఇంకా అర్థం చెబుతున్నారు భాష్యకారులు. దైవ గుణాలతో జన్మించాడంటే దైవ విభూతి కర్హుడట వాడు. అంతేగాక భావికల్యాణస్య. తరువాత జీవితంలో ఎంతో