#


Index

దైవాసుర సంపద్విభాగ యోగము

  ఇక్కడికి మొత్తం మీద 26 గుణాలు పేర్కొన్నది భగవద్గీత. ఇవన్నీ దైవ సంపదకు సంబంధించినవి. వీటిలో కొన్ని సాక్షాత్తు గానే గుణాలైతే మరికొన్ని అవగుణాలు లేకుంటే గుణాలు. దమం దానం దయ సత్యం త్యాగం తేజశ్శాచ మిత్యాదులు వాటి పాటికవే గుణాలు. అలా కాక అహింసా అక్రోధం అపైశునం - అద్రోహం నాతి మానితా ఇలాటి వన్నీ హింసా క్రోధ పైశునాది దోషాలు లేకుండా పోతే గుణాలు. మొత్తాని కెడా పెడా అనులోమంగా ప్రతిలోమంగా రెండు వైపుల నుంచీ ఏకరువు పెట్టాడు దైవగుణాలను మహర్షి. అయితే ఈ చెప్పిన వేనా అన్నీ ఇంకా ఏవైనా ఉండవచ్చా అని మనం సందేహించవచ్చు. చాలా వరకూ ఇక ఏదీ మిగల లేదనే అనుకోవచ్చు. ఎందుకంటే ఏ గుణాలైనా త్రికరణాలకు సంబంధించినవే. అటు మనస్సుకో ఇటు వాక్కుకో రెండూ గాక శరీరానికో చెంది ఉంటాయి. మనసులో ఆలోచనగా వాక్కులో మాటగా శరీరంలో చేష్టా రూపంగా బయటపడుతుందే గుణమైనా. చెప్పినవన్నీ ఇలా త్రికరణాలలో బయటపడుతున్న గుణాలే గాని మరొకటి కానరాదు. ఇంకా ఎన్నో మంచి గుణాలిలాంటివే చెప్పుకోవచ్చు గదా అంటే చెప్పుకోండి కాదన లేదు. అవి కూడా త్రికరణాలకు చెందినవే అయి ఉండవలసిందే గాని అంతకు మించి ఎక్కడా ఉండలేవు. వైయాకరణులు పేర్కొన్నట్టు ఇది పరిగణితం కాదనిపిస్తే ఆకృతి గణమని చెప్పుకొందాం. తప్పులేదు. ఆకృతి గణమంటే ఇలాంటి జాతి గుణాలింకా ఏవి కనిపిస్తే అవన్నీ ఇందులో

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు