మనోబుద్ధులలో కలిగే నైర్యల్య మంటారు భాష్యకారులు. అది ఎలాగని అడిగితే మాయారాగాది కాలుష్యా భావః అని వివరిస్తారు. మాయా మర్మం రాగం ద్వేషం ఇలాంటి భావాలు దయిస్తే కలుషితమవుతుంది మనస్సు. అలాటి భావ కాలుష్యం లేని మనస్పైతే నిర్మలంగా ఉంటుంది. ఈ మనో నైర్మల్యమే ముఖ్యమైన శౌచం. తలలు బోడులైన తలపులు బోడులా అన్నాడే వేమన. అది ఇలాటి శౌచం లేనివాళ్లను చూచి అన్నమాట. మద్య భాండాన్ని బయట ఎంత తోమి రుద్ది నీటితో కడిగి ఏమి సుఖం. లోపల అంతా పనికి మాలిన పదార్ధమేగా. అలాగే నూటికి 90 మంది పైకి ఎంతో గొప్పగా కనిపిస్తుంటారు. లోపల అంతా కుళ్లే. అంత శ్శౌచం లేదు. బాహ్యానికెలా ఉన్నా చిత్త శుద్ధి లేకపోతే అది నిరర్థకం.
పోతే మరి రెండు గుణాలు చెబుతున్నది గీత. ఒకటి అద్రోహమూ. మరొకటి నాతి మానితా. అద్రోహమంటే ద్రోహం లేకపోవటం. పరజిఘాంసా భావః అని అర్థం చెప్పారు ఆచార్యుల వారు. పరులను హింసించే బుద్ధి లేకపోవటం. అహింసా అని ఇంతకు ముందు వచ్చింది. అది హింసించట మయితే ఇది హింసించే బుద్ధి. అది లేకుంటే అహింస. ఇది లేకుంటే అద్రోహం. పోతే చిట్టచివరిదైన గుణం నాతి మాశితా అని గదా అన్నారు. అత్యంతమైన మానం అతి మానం. అది ఎవడికుంటే వాడతి మాని. నా అంత మహానుభావుడు లేడని గర్వించటం. దీన్నే ఆత్మ సంభావన Self Complacency అంటాడు ఆంగ్లంలో. అలాటి అహం భావం పెట్టుకోక వినయంగా ఉంటే దానికి నాతి మానితా అని పేరు.