అర్థం చెప్పారు గదా. అక్కడ వికారమనేది ఏర్పడితే దాన్ని తగ్గించుకోటమనీ ఇక్కడ అలాకాక అసలు మనసులో ఏ వికారమూ ఏర్పడకనే పోవటమనీ తేడా చెబుతారాయన. అయితే ఇది చాలా కష్టమైనదే అలవడటం. జన్మాంతరంలో ఎంతో కృషి చేసి ఉంటేగాని ఆ కృషికి ఫలితంగా ఈ జన్మలో అది అలవదు. ఏ జడ భరతుడి లాంటి వాడి జీవితంలోనో కనపడే గుణమిది. బాలోన్మత్తపిశాచ వత్తని బ్రహ్మవేత్తను వర్ణిస్తారు మన పెద్దలు. ఇలాటి గుణాన్నే మరో మాటలో చెబితే తితిక్ష Endurance అని కూడా పేర్కొంటారు. శమాది షట్కంలో అది ఒకటి.
అలాగే ధృతి అనేది కూడా ఒక గొప్ప గుణమే. ధృతి అంటే ధైర్యం. నిలదొక్కుకోటం. ఎలాంటిదది. దేహేంద్రియేషు అవసాదం ప్రాప్తేషు తస్య ప్రతిషేధః అంతఃకరణ వృత్తి విశేషః - దేహేంద్రియాదులు కూలబడి పోతుంటే వాటినలా పడిపోకుండా పట్టుకొని ఉండటం. యేన ఉత్తంభితాని కరణాని దేహశ్చ నావ సీదంతి. తన్మూలంగా దేహమూ ఇంద్రియాలూ కుంగిపోకుండా యధాపూర్వంగా గట్టిగా నిలబడి చురుకుగా పనిచేయగలవు. అలాంటి చిత్తవృత్తికి ధృతి అనిపేరు. ఎంతో ఆత్మ విశ్వాసమూ మనో బలమూ ఉన్నవాడికే అలాంటిది చూస్తాము మనం లోకంలో. మరి శౌచమని ఒక గుణమున్నది. శౌచమంటే శుచిత్వం పరిశుద్ధి అని అర్థం. అది రెండు విధాలు. ఒకటి బాహ్యం. ఇంకొకటి అభ్యంతరం. మృత్తికా జలాదుల వల్ల ఏర్పడేది బాహ్యమైన శౌచం. ఆభ్యంతరం