#


Index

దైవాసుర సంపద్విభాగ యోగము

కలిసి వస్తాయి. భూతదయ ఉండాలే మానవుడికైనా. అలోలుప్త్వం. అలోలు పత్వం. లోలత్వం లేకపోవటం. శబ్ద స్పర్శాది విషయా లేవి అనుభవానికి వస్తున్నా వాటి మీద అనురాగం పెంచుకొని వాటిలో తలమునకలయి పోకుండా నిర్లిప్తంగా అనుభవించటం. అసక్త స్సుఖమన్వభూ త్తన్నాడు కాళిదాస మహాకవి. అసక్తుడవయి అనుభవించాలేదైనా. మార్దవం. మృదుత్వం. అక్రౌర్యమంటారు భాష్యకారులు కూడా. క్రూర స్వభావం పనికి రాదు. Sadism అని ఇంగ్లీషులో అనే మాటకిది సరిపోతుంది. హ్రీః అంటే లజ్జ. ఈ పని చేస్తే పదిమందీ నవ్వి పోతారే అని సిగ్గుపడటం. సిగ్గు పడితే మానేస్తాడా పని మానవుడు. అచాపలం. చాపల్యమే మాత్రమూ పనికిరాదు. అసతి ప్రయోజనే వాక్పాణి పాదాదీనాం వ్యాపారయి తృత్వం. ఏ ప్రయోజనమూ లేకుండా ఆఖరుకు కాళ్లూ చేతులూ ఆడించటం కూడా తప్పే. అనవసరంగా మాటాడుతూ పోవటం కూడా చాపల్యమే.

  అంతేకాదు. ఇంకా మనమల వరుచుకోవలసిన మంచి గుణాలున్నాయి. తేజస్సొక గుణం. తేజస్సంటే ప్రాగల్భ్యం. న త్వగ్గతా దీప్తిః చర్మాని కుండే లావణ్యం కాదని అర్థం వ్రాశారు భాష్యంలో. మరేమిటి. ప్రాగల్భ్యమని అర్థమట. ప్రౌఢి గాంభీర్యమన్న మాట Majesty ఇంకొకటి క్షమా. ఆకృష్టస్య తాడి తస్యవా అంతర్విక్రియా నుత్పత్తిః అని భాష్యం. ఒకడు తన్ను ఈడ్చుకుపోయినా చితక కొట్టినా మనసులో ఏ మాత్రమూ వికారం లేకుండా స్తిమితంగా ఉండటం. అక్రోధమనే చోట గూడా ఇదే

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు