#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

విడిబడి సర్వత్రా వ్యాపించగలదు. ప్రస్తుతం మనం చూచే ఈ ఆకాశం నిరాకారం గనుకనే గదా సర్వత్ర పరచుకొని కనిపిస్తున్నది. జడమైన ఆకాశమే అలా ఉండగలిగితే చేతనమైన ఆత్మకేమిటి ఇబ్బంది. జ్ఞాన స్వరూపమే గదా ఆత్మ.

  అయితే అది పరిశుద్ధి చెందినప్పటి మాట గదా అంటావేమో. పరిశుద్ధమయ్యే ఉన్న దది. క్రొత్తగా కావలసిన అగత్యం కూడా లేదు. జ్ఞానమంటేనే నిరాకారం. నిశ్చలం. ఈశ్వర జ్ఞానమనే గాదు. జైవమైన జ్ఞానం కూడా. వస్తుతంత్ర మది. ప్రయత్న సాధ్యం కాదు. సిద్ధంగానే ఉందది. మరి ఎందుకని మనం మన జ్ఞానంతో సర్వ శరీరాలూ వ్యాపించలేక పోతున్నాము. వ్యాపించే ఉన్నాము వస్తుతః. కాని ఈ మేరకే ఉన్నట్టు మనకు ప్రతీతితః భాసిస్తున్నది. అవివేకరూపమైన భ్రాంతే దానికి కారణం. దేహేంద్రియాదుల నుంచి మన జ్ఞానాన్ని వేరు చేసి చూడలేక పోతున్నాము. చూస్తే ఇది ఇక దేహాత్మ కాదు. జీవాత్మ కాదు. బుద్ధ్యాత్మ అంతకన్నా కాదు. వాటన్నిటికీ సాక్షి అయిన ప్రత్యగాత్మ Innerself అని వెంటనే మన స్వరూపం మనకు గుర్తుకు వస్తుంది. వస్తే మనమే సర్వవ్యాపకమైన ఈశ్వర రూపంగా అనుభవానికి వస్తుంది. అప్పుడిక బద్ధుడైన జీవుడొకడూ వ్యాపకుడైన ఈశ్వరుడొకడని తేడా లేదు. అంతవరకూ ఎక్కడో ఉన్నాడని భావించిన ఈశ్వరుడీ జీవుడే అనే ప్రత్యభిజ్ఞ ఏర్పడుతుంది. కాబట్టి జీవేశ్వరైక్యమనే అసి పదార్థమిట్టే మన అనుభవానికి వస్తుంది. దానితో సంసారమనే సమస్య పూర్తిగా పరిష్కారమవుతుంది. జీవుడీశ్వరుడే కాబట్టి