#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

పూర్తి అయ్యేసరికి ఆచార్యుల వారు విస్తారంగా చెప్పిన భాష్యార్ధమంతా కలిసి వస్తుంది.

  మొదటి ప్రశ్న ఏమిటింతకూ. ఒకానొక శరీరంలో బందీ అయిన వాడు గదా ఈ జీవుడు. వీడు సకల శరీరాలూ వ్యాపించట మేమిటా అని. నిజమే. ఈ దేహమే నేననుకొనే దేహాత్మ అయితే వ్యాపించలేడు. ప్రాణమే నేనను కొనే జీవాత్మ అయితే వ్యాపించలేడు. మనసూ దాని ఆలోచనలూ మాత్రమేనని భావించే విజ్ఞానాత్మ అయితే వ్యాపించ లేడు. అలా కాక వీటన్నిటినీ కేవలం గమనిస్తున్న నేననే స్ఫురణ లేదా జ్ఞానం మాత్రమే నేనని భావించే ప్రత్యగాత్మ అయితే మాత్రం వ్యాపించగలడు. ఎందుకంటే మొదటి మూడు దశలలో దేహప్రాణాది ఉపాధులతో తాదాత్మ్యం చెంది ఆ మేరకే ఉన్నానని భావించే జ్ఞానమది. కనుక అది ఎంత నిరాకారమైనా సాకారమైన ఇవి దాన్ని తమవరకే కట్టివేసి తమ్ము దాటి పోనీయవు దాన్ని. ఎప్పుడైతే అవి నా స్వరూపం కాదు. నా జ్ఞానాని కని గోచరించే జ్ఞేయాలే గాని జ్ఞానం కాదని వివేచన చేసి చూస్తుందో అప్పుడది సోపాధికం గాక నిరూపాధికమైన కేవల జ్ఞానంగా తన్ను గుర్తిస్తుంది. జ్ఞేయమనే కాలుష్యం పూర్తిగా క్షాళితమయి పరిశుద్ధమైన జ్ఞానమే కాబట్టి నేను నేననే స్ఫురణ మాత్రమే కాబట్టి దానికప్పుడే ఆకారమూ ఉండదు. ఆకారం లేకుంటే వ్యాపారమూ Form & Function ఉండదు. అవి రెండూ రెండు హద్దులు జ్ఞానానికి. అవి తొలగిపోయాయి కాబట్టి నిరాకారమైన జ్ఞానమిక ఒక శరీరంలోనే ఉండవలసిన అగత్యం లేదు.