అలా అనిపించుకోవాలంటే ద్వైత మద్వైత దర్శనంగా మారాలి. అంటే క్షేత్రం కూడా క్షేత్రజ్ఞుడి స్వరూపమే అంత కన్నా క్షేత్రమనేది వేరుగా ఎక్కడా లేదనే దర్శనమేర్పడాలి. అదే అద్వైత దర్శనం. అలాంటి దర్శనమే జ్ఞానమే బంధమోచకం. మతం మమ. అలాటి అద్వైత జ్ఞానమే అసలైన జ్ఞానమనినా అభిప్రాయమంటాడు భగవానుడు.
అయితే ఇక్కడ రెండు సందేహాలు మనలను పట్టి పీడిస్తుంటాయి. ఒకానొక క్షేత్రంలోనే ఉన్న క్షేత్రజ్ఞుడనే జీవుడు సర్వక్షేత్రాలనూ వ్యాపించట మేమిటా అని ఒకటి. ఒకవేళ వ్యాపిస్తే వ్యాపించవచ్చు. అలా వ్యాపించా డనుకొన్నప్పటికీ తాను వ్యాపించిన ఆ శరీరాలు కూడా తన స్వరూపంగా ఎలా మారిపోతాయి. అలా ఏకమై అనుభవానికి వస్తాయా అని మరొకటి. ఈ రెండు సందేహాలూ తీరనంతవరకూ ద్వైతమే తప్ప అద్వైత భావం చస్తే మన మనస్సుకు పట్టదు. అందుకే స్వామివారిక్కడ చాలా దూరం విచారణ సాగించారు. అదంతా ఉన్నదున్నట్టు ఏకరువు పెడితే ఎవరో పండితులు కొందరు తప్ప విడిచి మిగతా ప్రజానీకాని కాకళించుకోట మసాధ్యం. కాబట్టి సాధకులైన వారిని దృష్టిలో పెట్టుకొని ఈ రెండు ప్రశ్నలకు క్లుప్తంగా మనం సమాధానం చెప్పుకోవటం మంచిది. అనవసరమైన శాస్త్ర విచారం కన్నా అవసరమైన ఫలితాన్ని అందించేది అదే మనకు. ఆ దృష్టితోనే రెండే రెండు ప్రశ్నలు వేసుకొని ఆ రెండింటి మీదనే విచారణ చేయదలచాను నేను. సంగ్రహంగా నేను చేసే ఈ విచారణ