#


Index

దైవాసుర సంపద్విభాగ యోగము

సర్వ ధర్మపధముల కెల్లన్నని. అదే ఉత్తమమైన ధర్మంగా వర్ణించారు మహానుభావులు. కాబట్టి హింస చేయకుండా అహింసను పాటించటం చాలా గొప్ప గుణం. యజ్ఞయాగాదులలో మాత్రం పరవా లేదని పెద్దలు చెప్పినా అది ఆయా దేవతల కోసం చేసే కామ్య కర్మ కాబట్టి మోక్ష సాధకుడి కదీ నిషిద్ధమే.

  మరొకటి సత్యమనే గుణం. అప్రియా నృత వర్జితం యధాభూతార్థ వచన మని వ్రాస్తున్నారు భాష్యకారులు. అబద్దం చెప్పగూడదు. ఉన్నదున్నట్టుగా మాటాడాలి. అయితే అది ఇతరుల ప్రాణం తీసేది కాకూడ దాసత్యం. వారికి ప్రియమైనది కావాలి. అంటే వారికి దానివల్ల హాని కలగకుండా మేలు కలిగించేదయి ఉండాలి. వారిజాక్షులందు వైవాహికములందు అని పెద్దలే చెబుతున్నారు. సత్యం బ్రూయా త్రియంబ్రూయా న్నబ్రూయా త్సత్యమ ప్రియమనే మాట అందుకే పుట్టింది. ధర్మరాజు వంటి వాడ బద్ద మాడాడా లేదా. రాముడి వంటి వాడు శూర్పణఖ కబద్ధం చెప్పాడా లేదా. కాబట్టి నిజం నిజంగానే చెప్పాలి గదా అని తెగిందాకా బిగించుకోరాదు. పోతే అక్రోధః అనే గుణం. కోపం లేకుండా ఉండటం. ఎప్పుడూ శాంతంగా ఉండే స్వభావం. తన కోపమె తన శత్రువన్నారు. కోపమునుబ్బును గర్వమని కాపురుష గుణాల్లో కోపాన్నే మొదటి అవలక్షణంగా పేర్కొన్నారు. పరైరాక్రుష్టస్య అభిహతస్యవా ప్రాప్తస్య క్రోధస్య ఉపశమనం. ఒకరు కొట్టినా తిట్టినా సహించే గుణముండాలని

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు