#


Index

దైవాసుర సంపద్విభాగ యోగము

ఏర్పడుతాయట. గుణాలనేవి వాటి పాటికవి స్వతంత్రంగా ఎక్కడా ఉండలేవు. ఏ వ్యక్తినో ఒక వ్యక్తి నాశ్రయించి ఉండాలి. ఆ వ్యక్తిని చూచినప్పుడు వాడి మాటల్లో వాడి ప్రవర్తనలో అవి బయట పడి కనిపిస్తుంటాయి మనకు. పుట్టుకతోనే రావాలీ గుణాలు మానవుడికి. దానికే నిసర్గ Inheritence మని పేరు. నిసర్గ సిద్ధంగా కొంత ఉంటే దాన్ని వాడు తరువాత అభివృద్ధి చేసుకోగలడు. దానికే సంస్కారమని పేరు Cultivation. సహజంగా లేనిది ఎంత ప్రయత్నించినా రాదు. ప్రకాశమనేది అసలు రత్నంలో అంతర్గతంగా ఉంటేనే అది సానబెట్టే కొద్దీ ప్రకాశిస్తుంది. ఒక నిప్పు రవ్వ అయినా అక్కడ ఉంటేనే పొగ గొట్టం పెట్టి ఊదితే మండుతుంది. అలాగే ఈ గుణాలు కూడా పుట్టుకతోనే రావాలి కొంతకు కొంత. అందుకే అభిజాతస్య అని వ్యంగ్యంగా సూచిస్తున్నది గీత.

  ఏమిటవి ఆ దైవ గుణాలు. ఒక్కొక్కటీ పేర్కొంటున్నది విందాము. మొదటిది అభయం. భయం లేకుండా బ్రతకటం. పిరికి తనమూ సంకోచమూ ఉంటే ఏమనీ సాధించలేడు మానవుడు. తన జీవిత లక్ష్యమేదో అది సాధించే ధైర్యముండాలి. వెనక్కు తగ్గగూడదు. రెండవది సత్త్వ సంశుద్ధి. సత్త్వమంటే అంతః కరణం. మనస్సు. అది ఎప్పుడూ పరిశుద్ధంగా నిర్మలంగా ఉండాలి. ఎవరితో వ్యవహరిస్తున్నా వంచనా మాయా అనృతమా ఇలాటి దొంగ వేషాలు పనికిరావు. మూడవది జ్ఞాన యోగ వ్యప స్థితి.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు