అనేవి రెండూ అసుర సంపద క్రిందికే వస్తాయి. కాబట్టి రెండే సంపదలు. అసుర సంపద రజస్తమోగుణాలతో కూడింది. రజోగుణం విక్షేపానికీ తమోగుణ మావరణానికీ దారి తీసే గుణాలు. మన ఆత్మ స్వరూపం కనపడకుండా కప్పేస్తుంది తమస్సు. అనాత్మ జగత్తును రెచ్చగొట్టి చూపుతుంది రజస్సు. ఇదే సమ్మోహమని ఇంతకు ముందు పేర్కొన్నది గీత. కనుకనే దీన్ని పూర్తిగా పరిత్యజించాలి మానవుడు. దీనికి భిన్నంగా సత్త్వగుణ మలవరుచుకోవాలి. అది సత్త్వ శుద్ధినీ తన్నిమిత్తంగా జ్ఞానాన్నీ మనకు ప్రసాదిస్తుంది గనుక మనకది వాంఛనీయం. ఇదీ ఇందులో ఇమిడి ఉన్న ఆంతర్యం. ప్రస్తుతం మన మభ్యసించ వలసిన ఆ దైవ సంపద ఎలాటిదో వర్ణిస్తున్నది గీత.
అభయం సత్త్వ సంశుద్ధిః జ్ఞాన యోగ వ్యవస్థితిః
దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ స్తవ ఆర్జవమ్ - 1
అహింసా సత్య మక్రోధ - సాగ శ్శాంతి రపైశునమ్
దయా భూతే ష్ఠలోలుప్త్వం - మార్దవం హ్రీ రచాపలమ్ - 2
తేజః క్షమా ధృతి శ్శౌచ - మద్రోహో నాతి మానితా
భవంతి సంపదం దైవీ మభిజాతస్య భారత - 3
మొత్తం 26 గుణాలు చెబుతున్నది దైవ సంపదకు చెందినవి. అన్నీ చెప్పి చివరకొక మాట అంటున్నది గీత. ఏమని. భవంతి సంపదం దైవీ మభిజాతస్య. దైవసంపదతో పుట్టిన మానవుడికివి సహజంగానే