#


Index

దైవాసుర సంపద్విభాగ యోగము

పురుషోత్తమ తత్త్వమున్నదో మూడవది దాన్ని మాత్రమే నీవు వాటేసుకోవలసి ఉంటుందెప్పటికైనా. అదే యోమా మేవ మసమ్మూడో జానాతి పురుషోత్తమం ససర్వ విత్ భజతిమా మనే చివరి శ్లోకంలో బోధిస్తున్నదీ అధ్యాయం. ఇదే మనకది చెప్పదలచిన ముఖ్య విషయం. క్షరాక్షర విలక్షణమైన మూడవ పురుషతత్త్వం. అయితే క్షరా క్షరాలంటే ఏమిటో ఆ రెండింటి స్వరూపం బాగా తెలిస్తే గాని ఈ మూడవదాన్ని మన మందుకోలేము. ఆ కొమ్మ వదిలేస్తే గాని ఈ కొమ్మ పట్టుకోలేము గదా. అందుకోసం వర్ణించవలసి వచ్చింది ఆ రెండింటినీ. ప్రతిలోమంగా అవి దీని జ్ఞానాన్ని మనకందిస్తాయి.

  కాబట్టి క్షరాక్షర పురుషులను రెండింటినీ తప్పించుకొని మూడవదైన పురుషోత్తమ తత్త్వాన్ని చేరాలి మనం. అలా చేరాలని చెప్పింది ఆ అధ్యాయం. బాగానే ఉంది. కాని అలా చేరటమనేది అంత సులభం కాదు. కారణ మసమ్మూఢః అని ఒక షరతు పెట్టారక్కడ. సమ్మోహమనేది లేకుండా పోవాలి మనకు. సర్వభూతాని సమ్మోహం సర్దేయాంతి పరం తప అని ఇంతకు పూర్వమే గీతలో వచ్చింది. సర్గమంటే జన్మ. మానవుడు జన్మించటమే అసలు సమ్మోహంతో జన్మించాడట. జన్మతో వచ్చిందా అవలక్షణం. అదే అజ్ఞానం. దానికి కారణం ప్రకృతి గుణసాంగత్యం. సత్త్వరజస్తమో గుణాలే ప్రకృతి గుణాలు. ఇందులో రజస్తమో గుణాలు రెండూ అసుర సంపద. సత్త్వగుణ మొక్కటే దైవ సంపద. సంపద అంటే

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు