16. దైవాసుర సంపద్విభాగ యోగము
పురుషోత్తమ ప్రాప్తియోగమయి ప్రస్తుతం పదహారవ దైవ దైవాసురాధ్యాయంలో ప్రవేశిస్తున్నాము. పురుషోత్తమాధ్యాయం మనకు ముగ్గురు పురుషులను వర్ణించి చెప్పింది. క్షర పురుషుడొకటి. అక్షర పురుషుడొకటి. పోతే రెంటికీ అతీతమైన ఉత్తమ పురుషుడొకటి. ఇలా మూడింటినీ పేర్కొనటంలో ఆంతర్యం కూడా చివరకు బయటపెట్టింది. ఏమిటది. క్షరా క్షరాలను కాదు మానవుడు పట్టుకోవలసింది. పట్టుకొనే ఉన్నాడిప్పుడా మాటకు వస్తే. ఇవి పట్టుకొన్నా సుఖం లేదు. నిన్ను సంసారంలో పడదోసేవే. దీని నుంచి నీవు తప్పించుకొని బయట పడాలంటే వీటి కతీతమయి మరలా వీటి రెండింటినీ వ్యాపించిన ఏ