క్షరమని అక్షరమని క్షరాక్షరాల కతీత మనిమూడు రాసులుగా విభజించాడు శాస్త్ర విషయమంతా. చరాచర పదార్థాలన్నీ క్షరమనే మాటలో కనిసివచ్చాయి. అక్షరమనే దానిలో దీనికి మూలమైన మాయాశక్తి కలిసి వచ్చింది. పోతే దానికీ దీనికీ ఆశ్రయమైన పరమాత్మ అతీతమనే మాటలో కలిసివచ్చింది. అంతేగాదు. రెంటికీ అతీతమే గాక లోకత్రయ మావిశ్య అనటంలో వీటి రూపంగా కూడా అదే కనిపిస్తున్నదని చెప్పటంలో ఆయన స్వరూప విభూతులు రెండూ చేరిపోయాయి.
ఇది సిద్ధాంతమైతే ఇక సాధన ఏమిటో అదీ చెప్పిందీ అధ్యాయం మమైవాంశో జీవభూతః - జీవుడాయన అంశే. ప్రకృతి గుణాలతో చేతులు కలిపి రాకపోకలు సాగిస్తున్నాడు. ఇదీ వీడి సమస్య. దీని నుంచి బయటపడాలంటే యోమామేవ మసమ్మూఢః జానాతి. నా గుణాతీతమైన స్వరూపాన్ని అయమహమస్మి అని తన స్వరూపంగానే భావన చేస్తేచాలు. అదే వీడు చేయవలసిన సాధన అని చెప్పింది. అంతేగాక అలా భావిస్తే సర్వవిద్భజతి మామ్మని సర్వాత్మ భావమనే సిద్ధిని కూడా మనకు వర్ణించి చెప్పింది. ఇక ఇంతకన్నా చెప్పవలసిందే ముంది. ముక్తసరిగా అన్నీ చెప్పినట్టే. అందుకే ఇది శాస్త్రోకదేశమైనా శాస్త్రమే. ఒక్క గీతాశాస్త్రార్థమే