#


Index

పురుషోత్తమ ప్రాప్తి యోగము

దర్శించాలంటా రాయన. అప్పుడే అహంబ్రహ్మాస్మి అనే అనుభవ మేర్పడుతుంది నీకు. లేకుంటే తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదమన్నట్టు పురుషోత్తముడు పురుషోత్తముడే. జీవుడు జీవుడే. ఆ ఈశ్వరుడెవడోగాదు నేనే నా స్వరూపమే అని మనసా భావించినప్పుడే ససర్వవి ద్భజతిమామ్ సర్వభావేన. వాడు సర్వమూ తెలిసిన వాడవుతాడు. సర్వమూ నేనేననే భావంతో నన్ను భజించిన వాడవుతాడని ప్రశంసిస్తున్నాడు పరమాత్మ. ఇక్కడ విత్ వేదవేత్తి అనే మాటా భజతి అనే మాటా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం. చాలా గంభీరమైన అర్థమిమిడి ఉందీ రెండు మాటల్లో. ఇంతకు ముందు కూడా కొంత సూచన చేశాను నేనక్కడక్కడా. మరలా చెబుతున్నాను వినండి. వేద వేత్తి అంటే కేవలం తెలుసు కోటమనేగాదు. చూడటమని ఆ శబ్దాని కసలైన అర్థం. Not to know but to see face to face వేదమనే పేరు అందుకే వచ్చింది. మహర్షులిటు ధర్మాన్నిగాని అటు బ్రహ్మాన్ని గాని జ్ఞాననేత్రంతో దర్శించే మనకు బోధించారా సత్యాన్ని. దర్శనమని శాస్త్రానికందుకే పేరు వచ్చింది కూడా. కాబట్టి సర్వత్రా పురుషోత్తమ తత్త్వాన్ని దర్శించాలి మొదట. అది సర్వవిత్. తరువాత భజతిమాం సర్వభావేన. ఆ సర్వమూ ఏదోగాదు నేనేననే భావంతో దాన్ని భజించాలి. అంటే దాన్ని తనలో ఐక్యం చేసుకోవాలి. భజన అంటే కలయిక

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు