అని క్షేత్ర జ్ఞాధ్యాయంలో భగవత్పాదులు చీవాట్లు పెట్టింది. అసలే అర్థంకాక చస్తుంటే లోకులు వారినింకా పెడదోవ పట్టిస్తున్నారని ఘాటుగా మాటాడారు. భవతు. తుష్యతు దుర్జన ఇతివయ ముదాస్మహే -
యోమామేవ మసమ్మూఢః - జానాతి పురుషోత్తమమ్
ససర్వ విద్భజతి మాం సర్వభావేన భారత - 19
యోమామేవ మసమ్మూఢః జానాతి. అంచేత ఎవడైతే ఇలాటి మార్గంలో పడిపోకుండా విచేచనా బుద్ధితో నన్నిలా పట్టుకొంటాడో. ఏమని. పురుషోత్తముడనే భావంతో. అంటే నిర్గుణమూ అదే సగుణమూ అదే సచ్చిదాత్మకమూ అదే సచ్చిద్విశేషాలైన నామ రూపాలుగా విస్తరించినదీ అదే స్వరూపమూ అదే విభూతీ అదేనని ఇలానా పురుషోత్తమత్వాన్ని ఎవడు గుర్తిస్తాడోనని షరతు పెడుతున్నాడు పరమాత్మ మనందరికీ. కనీసం సాధకలోకానికి. ఏమని గుర్తించాలో అది వివరిస్తున్నారు భాష్యకారులు. అక్కడెక్కడో పురుషోత్తము డున్నాడు. ఇక్కడ నేనున్నాను. నా బుద్ధితో ఆయన స్వరూపాన్ని నేను ఫలానా అని అర్థం చేసుకొంటున్నానని ఇలా పరోక్షంగా భావించటం కాదు. అయ మహమస్మీతి. అదేదో గాదు నా కన్యంగా ఎక్కడో లేదు. నేనే అది అనే స్వసంవేదనతో అపరోక్షంగా
Page 264