#


Index

పురుషోత్తమ ప్రాప్తి యోగము

కావ్యాదిషు మహా కవులు తాము రచించే కావ్యాలలో కూడా పరమాత్మను పురుషోత్తముడని వర్ణిస్తుంటారంటారు భగవత్పాదులు.

  మరి వేదంలోనంటారా. పురుషసూక్తంలో అదే పురుష ఏ వేదగ్ సర్వం ఈ క్షరాక్షరాత్మకమైన సమస్త ప్రపంచమూ పురుషస్వరూపమేనని వర్ణిస్తూ మరలా ఏతావా నస్యమ హిమా అతో జ్యాయాంశ్చ పూరుషః ఇదంతా ఆయన విభూతే సుమా. మరి ఆయన స్వరూప మంటారా అతో జ్యాయాన్. దీన్ని అతిక్రమించి ఎంతైనా ఉందని చాటుతున్నది. ఇలా శాస్త్రంలో లోకంలో కూడా ప్రథితః ప్రసిద్ధమే. దీన్ని బట్టి చెప్పినా చెప్పవచ్చు అది ఎంత పరిపూర్ణమైన త్తత్వమో. ఇక్కడ కొంతమంది వైష్ణవులు విపరీత వ్యాఖ్యానాలు చేస్తున్నారీ శబ్దానికి. వారు ఉత్తమ పురుషుడు వేరు పురుషోత్తముడు వేరని తేడా చూసుకొని మాట్లాడుతున్నారు. అది కేవలం వారి అపోహ. అలాటి తేడాయే ఉంటే ఉత్తమః పురుషస్త్యన్యః అని ప్రధితః పురుషోత్తమః అని రెండు మాటలూ ఏకార్థంలో ప్రయోగించి ఉండడు మహర్షి. రెండింటినీ పర్యాయపదాలుగానే భావించి ప్రయోగించాడాయన. ఇదంతా అమర్చిన దానిలో అత్తగారు వేలు పెట్టిందన్నట్టు అతి తెలివిగా ఆలోచించే వ్యవహారం. అందుకే స్వయం మూఢః పరాన్ వ్యామోహయతి

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు