భాసించినా అది ఎప్పుడూ అవ్యయమే. తరంగ బుద్బుదాడుల రూపంగా వ్యయమయిందా సముద్రం. ఎప్పుడూ దాని పరిమాణంలో హెచ్చు తగ్గులుండబోవు. దీనినే conservation of energy అని పేర్కొంటారు. ఈనాటి శాస్త్రజ్ఞులు.
యస్మాత్ క్షరమతీతోహ - మక్షరా దపి చోత్తమః
అతోస్మిలోకే వేదేచ- ప్రథితః - పురుషోత్తమః - 18
అసలు పురుషోత్తమ అంటే మీరేమను కొంటున్నారు. ఆమాటకిదే అర్థం. క్షరాక్షర పురుషులను రెండింటినీ వ్యాపిస్తున్నదీ అదే వాటికతీతంగా ఉన్నదీ అదే. పురుష అన్నప్పుడీ రెండూ అదేననీ - ఉత్తమ అన్నప్పుడీ రెండూ కానిదే అదేనని. అదే వర్ణిస్తున్నాడిప్పుడు. యస్మాత్ క్షరమతీతోహం సంసార మాయా వృక్షమైన అశ్వత్థాన్ని దాటిపోయిన వాడూ పరమాత్మే. అలాగే అక్షరా దపి చోత్తమః మాయా వృక్షానికేది బీజభూతమో అలాటి మాయాశక్తిని దాటినవాడూ పరమాత్మే. అవి రెండూ తానే అయి . Both Immanent and Transcen-dent గనుకనే పురుషోత్తముడని పేరు సార్థకంగా ఏర్పడిందాయనకు. ఎక్కడా ఎలా. లోకే వేదేచ ప్రథితః లోకంలో వేదంలో కూడా ఉందా ప్రసిద్ధి ఆయనకు భక్తలోకంలో. ఎలాగంటే భక్తజనః భక్తులైనవారందరూ పురుషోత్తమ పురుషోత్తమ అని కీర్తిస్తుంటా రాయనను. అలాగే కవయః