#


Index

పురుషోత్తమ ప్రాప్తి యోగము

పరమమయి కూడా సుఖం లేదు. అలాగైతే నిరాకారమైన ఆకాశం సర్వత్రా ఉన్నదది పరమం. కాని చైతన్యం లేదు దానికి. అంచేత ఆత్మకాదు. కాగా ఇది పరమమూ ఆత్మకూడా. కనుక దీనికిక తిరుగులేదు. ఎప్పటికీ వినాశం లేదు. అనంతమైనది. కనుకనే యో లోకత్రయ మా విశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః - లోకత్రయాన్నీ వ్యాపించగలదది. అవిశ్య అంటున్నాడు. ఆవిశ్య అంటే లోపలా వెలపలా మధ్యలో కూడా చొచ్చుకొని ఉన్నదని అర్థం. లోకత్రయమంటే త్రిగుణాలు. దేశకాల వస్తువులు. నామ రూపక్రియలు. ఏవైనా త్రయమే. ఈ త్రయాన్ని వ్యాపించిందంటే త్రయమంతా అదే.

  చిత్రమేమంటే అంతా అదే అయి మరలా దాన్ని తనకు విషయంగా చేసుకొని బిభర్తి తనలో ధరించి ఉంది. తన సంకల్పబలంతో సృష్టించగలదు. పోషించగలదు. చివరకు తనలోనే లయం చేసుకోగలదు. ఈశ్వరః అందుకే ఈశ్వర. పరమాత్మగాక ఈశ్వరు డయిందది. ఈశ్వరత్వమంటే అన్నింటినీ అజమాయిషీ చేయటం. పరమాత్మ అన్నప్పుడు స్వరూపస్థితి. ఈశ్వరు డన్నప్పుడదే విభూతి స్థితి. మొదటిది నిర్గుణం Reality రెండవది సగుణం God రెండూ ఒకటే మరలా. మరి రెండుగా కనపడుతుం దంటున్నారు. మారిపోవటం గదా అది. మారితే కూటస్థమెలా అయింది. పరమాత్మ ఎలా అయిందని సందేహం వస్తే సమాధాన మిస్తున్నాడు. అవ్యయమని. వ్యయం లేనిదేదో అది అవ్యయం - వ్యయమంటే

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు