#


Index

పురుషోత్తమ ప్రాప్తి యోగము

ఇప్పుడు క్షరాక్షరాలు రెండింటి విషయమూ అయిపోయింది. పోతే ఇక మూడవ దేమిటో చెబుతున్నాడు మహర్షి అది ఈ రెండు పాధులనూ అంటిముట్టకుండా నిత్య శుద్ధబుద్ధముక్త స్వభావమైనది. అది వస్తువైతే substance దానికివి రెండూ ఉపాధులు Media మాత్రమే. ఏమిటది చెబుతున్నాడు వినండి.

ఉత్తమః పురుషస్త్వన్యః - పరమాత్మేత్యుదాహృతః
యోలోక త్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః - 17

  అది ఏదోకాదు ఇవి రెండూ క్షరాక్షరాలైతే అది ఉత్తమః పురుషః అన్యః అది వీటి రెండింటినీ మించి వీటికి విలక్షణంగా ఉన్న పురుషతత్త్వం. ఇవి పురుషులే అయినా వ్యాపించే స్వభావమున్నా దానిలాగా పూర్తిగా వ్యాపించలేవు. అవి వీటి రెంటికీ అతీతంగా ఉండి రెంటినీ వ్యాపించగలదు. ఇవి ఒక దానినొకటీ వ్యాపించలేవు. దాని నసలే వ్యాపించలేవు. అందుకే దాన్ని పరమాత్మ అని పేర్కొన్నారు. పరమాత్మ అంటే దేహాద్య విద్యాకృతాత్మభ్యః - దేహాత్మ ఇంద్రియాత్మ ప్రాణాత్మ బుద్ధ్యాత్మ అని ఎక్కడికక్కడ ఉపాధులమేరకే దించిచూచే ఆత్మకాదది. ఇవన్నీ అవిద్యామిళితమైన నకిలీ ఆత్మలు. అది వీటన్నిటినీ దాటిపోయిన అసలైన ఆత్మ - కనుకనే పరమ. పరమమేగాక ఆత్మకూడా. ప్రత్యక్చేతనః అని వ్రాస్తున్నారు స్వామివారు. నేను అనే స్ఫురణ. ఈ స్ఫురణ లేకుండా

Page 259

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు