టంటారు. బాగా ఆలోచించి అర్థం చెబుతున్నారు భాష్యకారులు. భగవన్మాయా శక్తిః క్షరాఖ్యస్య పురుషస్య ఉత్పత్తిబీజం అనేక సంసారి జంతునామ కర్మాది సంస్కారాశ్రయః పరమాత్మ నాశ్రయించి ఉన్న ఆయన మాయాశక్తే అక్షరమంటే. క్షరమని వర్ణించిన జీవుడి జన్మకు కారణమది. అజ్ఞానం వల్లనేగదా జీవుడనే వాడు తయారయ్యాడు, పోతే వీడి కామకర్మాది వాసనలకు కూడా అదే నిలయం.
కూటస్థమని దానికే పేరు. కూటోరాశి రివస్థితః కూటమంటే రాశి. రాశిలాగా అన్ని సంస్కారాలనూ తనలో పోగుచేసుకొని ఉన్నది. లేదా కూటో మాయా వంచనా. మోసమంతా దానిలోనే ఉంది గనుక కూటస్థం. సంసార బీజానంత్యాత్ నక్షర తీత్యక్షరమ్. సంసార కారణంగా అది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది కాబట్టి కూటస్థమేగాక అది అక్షరం కూడా అని వర్ణిస్తారాయన. ఈ అక్షరమనే శబ్దమక్షర పరబ్రహ్మ యోగమనే అధ్యాయంలో ఇంతకు ముందే వచ్చింది. అక్కడ రెండక్షరాలను వర్ణించాడు వ్యాస భగవానుడు. రెండూ అవ్యక్తమేనని చెప్పి అందులో ఒక అవ్యక్తం కన్నా మరొక అవ్యక్తం విలక్షణమని పేర్కొంటాడు. మొదటిది అవిద్యా రూపమైతే రెండవది దాని కతీతమైన బ్రహ్మ మని భగవత్పాదుల భాష్యం. అందుకే అక్షర పరబ్రహ్మమని పేరు వచ్చింది పరమాత్మకు. అదంతా మనసులో ఉండే భగవత్పాదు లిక్కడ ఈ అర్థం చెప్పారు అక్షర శబ్దానికి. సరే మంచిది
Page 258