#


Index

పురుషోత్తమ ప్రాప్తి యోగము

విశేషాలన్నిటినీ ఇది ఫలానాగదా అది ఫలానా గదా అని బయటపెట్టి వాటిని తన విశేషాలుగా దర్శించనూ గలదది. అవి ఎక్కడికీపోవా జ్ఞానాలు. అన్నీ సర్వాత్మ స్వరూపుడైన తనలో లయమైనా తన శక్తి ప్రభావం చేత ఎంత లయం చేసుకోగలడో అంత మరలా తనకు విషయంగా దర్శించగలడు. లయం చేసుకుంటే అది తన స్వరూపం. విషయంగా చూస్తే తన విభూతి ఇదే యథాభూత పృథగ్భావమనీ సర్వభూతస్థ మాత్మానమనే చోట ఇంతకు పూర్వం చాటి చెప్పాడు పరమాత్మ. అందులో ఇదీ ఇందులో అదీ దర్శించటమే అద్వైతానుభవం. అదీఇదీ అన్నాము గదా అని ఆత్మకు భిన్నంగా అనాత్మ ఒకటేదో వాస్తవంగా ఉందని అపోహ పడరాదు మరలా. అహమేగాని మమలేదు. మమ కూడా అహమే అద్వైతంలో. అందుకే వేదైశ్చ సర్వై రహమేవ వేద్యః - వేదాంత కృద్వేద విదేవ చాహమంటున్నాడు గీతాచార్యుడు. గమనించండి. వేద్యమూ అహమే వేత్తా అహమే అంటే అహమనే ఆత్మ భావమొక్కటే అహంగా ఒక చోటా మమగా ఒకచోటా రెండవతారాలెత్తింది. ఆత్మానాత్మలుగా తానే విభక్తమై తన్నుతానే గ్రహిస్తున్నది. అనుభవిస్తున్నది. తనతో తానే వ్యవహరిస్తున్నది. అలాంటిప్పుడిక ఒకరొకరిని ప్రశ్నించే దేమున్నది. ఉత్తరమివ్వట మేమున్నది. ప్రశ్నోత్తరాలు రెండూ ఆత్మ విలాసమే. అది ఆడే నాటకమే.

  యదాదిత్య గతమనే శ్లోకం మొదలు సర్వస్య చాహమనే శ్లోకం వరకూ ఈ నాలుగు శ్లోకాలలో వ్యాసభగవానుడు పరమాత్మతాలూకు విభూతి

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు