ఈ వెలుగులో చూస్తే వేదాలనే మాటకు నాలుగు వేదాలని అర్థం
చెబితే సరిపోదు. వాచ్యార్థమదే అయినా లక్ష్యార్థ మదిగాదు. మానవ జాతి
బుద్ధులకు స్ఫురించే అన్ని జ్ఞానశాఖలకూ వేదమని పేరు. Branches of
Knowledge అది లోకమో శాస్త్రమో శిల్పమో ధర్మమో అడగకండి. అన్నీ
విశేష జ్ఞానాలే. అన్ని విశేషాలకూ కడపటి వేద్యమేది. తరంగ బుద్బుదాదు
లన్నిటికీ ఏది కారణం. వాటి ద్వారా పట్టుకోవలసిన పదార్థమేది.
వాటన్నిటినీ వ్యాపించిన ఒకేఒక జలమనే భావమే గదా. అంటే విశేషాలకు
గమ్యం సామాన్యమే. అలాగే మానవులకు కలిగే అన్ని జ్ఞానాలకూ ఏకైకమైన
గమ్య మా పరిపూర్ణమైన జ్ఞానమే. అదే వేద్య The only thing to be
known మనేమాటకర్థం. ఎందుకంటే వేదాంతకృత్ వేదమంటే
జ్ఞానమనిగదా అర్థం చెప్పాము. దాని కంతకృత్ అంతం చేసేది. అంటే
అర్థం. ఆయా విశేషాల తాలూకు జ్ఞానమెంత ఎవరు సంపాదించినా చివరికీ
విశేషజ్ఞానాలన్నీ ఆ అఖండాత్మ జ్ఞానంలో అంతమయి పోవలసిందే.
నదీనాం సాగరోగతిః అన్నట్లు ఆ పరిపూర్ణ జ్ఞానం వీటన్నిటినీ తనలో
కలుపుకొంటుంది. సర్వం కర్మాఖిలం పార్థజ్ఞానే పరిసమాప్యతే. అదే
అంతకృత్తనే మాటకర్థం.
వేద విదేవ చాహమ్ లౌకిక శాస్త్రీయాది విశేష జ్ఞానాలన్నింటినీ తనలో కలిపేసుకొని వాటినంతం చేయటమేగాదు. మరలా ఆ