మనకందరికీ ఇప్పుడున్న జ్ఞానమే. ప్రమేయం అఖండమైన ఆ జ్ఞానం. అదే పరమాత్మ స్వరూపం. మరి ఇప్పుడంతో ఇంతో జ్ఞానముంది గదా మనకు. అదే గదా ప్రమాణమని చెబుతున్నారు మీరు. అలాంటప్పుడా పరిపూర్ణమైన తత్త్వమెందుకు స్ఫురించటం లేదు. పరిపూర్ణం గనుకనే స్ఫురించటం లేదని జవాబు. మన ఈ జ్ఞాన మపరిపూర్ణం అది పరిపూర్ణం. ఎంత శాస్త్రజ్ఞుడి జ్ఞానమైనా విశేష జ్ఞానమే. విశేషం గనుక అపరిపూర్ణమే. అపరిపూర్ణమైన జ్ఞానమెంత ప్రమాణమైనా పరిపూర్ణమైన ప్రమేయాన్ని పట్టుకోలేదు. అందుకే చేతనమైన మన బుద్ధి కూడా అచేతనమైన సూర్యచంద్రాదులలాగే తమలోనే ఉన్న ఆ పరమాత్మ చైతన్యాన్ని గుర్తించ లేకపోతున్నదని అంతర్యామి బ్రాహ్మణం ఘోషిచంచటం. సూర్యచంద్రులంటే మనసుకూ బుద్ధికీ సంకేతాలే అసలు. ఇందులో దాగిఉన్న చైతన్యం పరిపూర్ణం గాదు. పరిపూర్ణమయిందో అప్పుడది దీనికి ప్రమేయమేగాదు. రెండూ పరిపూర్ణమే కాబట్టి రెండూ కలిసి అప్రమేయ మయిపోతాయి. పోతాయిగాదు. పోతుంది. పోతే అది ఇక ప్రమేయంగా ఎక్కడా కనపడదు. అంటే అనాత్మలేదు. అంతా ఆత్మస్వరూపమే. దీనికే ఏకాత్మ భావం సర్వాత్మ భావమని The subjective unity of all things. Total merger of the objects in the subjective consciousness. అద్వైతులు పెట్టిన పేరు.