మనకు కలుగుతూ తొలగుతూపోయే ఈ జ్ఞానం. ఇది లౌకికమే కావచ్చు. శాస్త్రీయమే కావచ్చు. ధార్మికమే కావచ్చు. ఏదైనా పరిచ్ఛిన్నమే. limited పరిపూర్ణం infinite కాదు. అందుకే పరిపూర్ణ జ్ఞానం చేతిలో ఇది కీలుబొమ్మ. అది ఎలా ఆడిస్తే ఇది అలా ఆడవలసి ఉంటుంది. అది అంతోఇంతో ఇస్తే తీసుకోవాలి. ఎంత గుర్తుచేస్తే అంతే మన సొమ్మనుకోవాలి. ఎప్పుడది మాఫీ చేస్తే అప్పుడు దిక్కులు చూస్తూ కూచోవాలి. దానిలాగా సర్వజ్ఞత లేదు గదా మరి.
అదెప్పుడు నోచుకొంటామా సర్వజ్ఞతకు. అహం బ్రహ్మాస్మి అదే నేనని దానితో ఏకమయినప్పుడే. అప్పు డాయనకున్న జ్ఞానమంతా మనదవుతుంది. అయితే ఆయన లేడు. నేనే నాకు మిగిలిపోతాను. జీవాత్మ కానప్పుడు నేను. పరమాత్మనే. ఇద్దరుండరు పరమాత్మలు. కనుక అంతవరకూ పరోక్షంగా ఊహించిన పరమాత్మ అపరోక్షంగా మన స్వరూపమే అయికూచుంటాడు. అయితే మరి ఆ భాగ్యమెప్పుడు పడుతుంది మనకు. అదే బోధిస్తున్నా డిప్పుడు కృష్ణ భగవానుడు నరుడు నెపంగా నరజాతి కంతటికీ.
వేదైశ్చసర్వై రహమేవవేద్యః వేదాలన్నింటి ద్వారా గ్రహించగల ఒకే ఒక వేద్యమైన పదార్థం తానేనంటాడు. వేదమంటే ప్రమాణం. జ్ఞానసాధనం. ప్రమాణమే సాధనం. సాధనం లేకుండా సాధ్యమనేది సిద్ధించదు. ప్రమాణం
Page 252