జ్ఞానం కలుగుతున్నదంటే సామాన్య జ్ఞానమనేది లేకుంటే కలుగుతుందా. అది వృక్షమైతే ఇవన్నీ దాని కొమ్మలు రెమ్మలు.
అంతేకాదు. మన ఈ వృత్తి జ్ఞానాలూ దాని వల్లనే. ఈ మాత్రమైనా మనకు స్ఫురిస్తూ ఉండటం కూడా దానివల్లనే. మత్తః స్మృతిః ఉదయించిన అంతో ఇంతో ఈ జ్ఞానం మరలా అస్తమించకుండా స్మృతి పథంలో నిలిచి ఉన్నదంటే వెనకాల ఆ అఖండ జ్ఞాన ప్రకాశం పనిచేయక మద్దతివ్వకపోతే గుర్తుంటుందా ఏ విషయమైనా మానవునికి. జ్ఞానంగానీ దాని స్మృతి knowledge and memory ఒక కంప్యూటరు లాగా మనలో పనిచేస్తున్నాయంటే అది రన్నవకపోతే ఎలా చేస్తాయి. ప్రేరకుడు పరమాత్మే అప్పటికి. వాడు ఓపెన్ చేస్తే జ్ఞానం క్లోజ్ చేస్తే అది స్మృతి. పోతే కంప్యూటర్లో దాని రూపరేఖలు కూడా మిగలకుండా మొత్తం మాఫీ చేసినా చేయవచ్చువాడు. అపోహ నంచ. దానికే అపోహన మని పేరు. ఒక్కటీ స్ఫురించకుండా చేయటం. ఎంత బుర్రపగల గొట్టుకొన్నా ఒక్కొక్కప్పుడు మానవుడి కేదీ గుర్తురాదు. అదితాను ముందునుంచీ అభ్యసించిన విషయమే కావచ్చు. కాబట్టి సమయానికి గుర్తువస్తే అది స్మృతి. అసలే రాకపోతే అది అపోహ. ఒక వాహనం పనిచేయటం చేయకపోవటం వాహనం నడిపేవాడి చేతిలో ఉన్నట్టు మానవుడి విజ్ఞానమెంత తక్కువైనా ఎక్కువదైనా పరిపూర్ణం కాదు. పరిపూర్ణజ్ఞానం పరమాత్మదే. అందులో ఏక దేశమే
Page 251