దాన్ని ప్రకాశింప చేయవచ్చుగదా అంటే చేయవచ్చు. సందేహం లేదు. ఇది ప్రపంచ వాసనలతో నిండి కలుషితమూ పరిమితమూ కాకపోతే తప్పకుండా దాన్ని గుర్తించగలదు. అది సత్త్వగుణం బాగా పైకి వస్తేనే జరుగుతుంది. బుద్ద్యావిశుద్ధయా అని భగవద్గీతమాట. అలాకాక రజస్తమోగుణ మాలిన్య మేమాత్రం దెబ్బతీసినా ఆ మేరకు గ్రహించే శక్తి దానికి లోపిస్తుంది. అప్పుడు కర్మానుస్థాన యోగాభ్యాస మంత్రతంత్రాది విద్యలలో పడిపోయి ప్రక్కదారులు దొక్కుతుందేగాని చక్కని రాజమార్గంలో ప్రవేశించలేదు. అంచేత మానవుడి బుద్ధిలో అంతర్గతంగానే ఉన్నా ఆ ప్రకాశం దాన్ని ప్రకటం చేసుకొని అనుభవానికి తెచ్చుకొనే సామర్థ్యమన్ని బుద్ధులకూ ఉండదు. మనుష్యాణాం సహస్రేషు అన్నట్టు కోటికొకడి కుంటుందిలాంటి ఉత్తమమైన బుద్ధి.
అదే చెబుతున్నా డిప్పుడు పరమాత్మ, సర్వస్యచాహం హృదిసన్ని విష్టః ఉండటమేమో నేను సర్వమానవుల బుద్ధులలోనూ సమానంగానే వచ్చి కూచున్నాను. అంతేకాదు. మత్తః స్మృతిః జ్ఞానం. నా వల్లనే వారి బుద్ధులలో జ్ఞానమనేది ఉదయిస్తున్నది. సర్వజ్ఞుడైన పరమాత్మ మన బుద్ధులలో లేకపోతే మనకీపాటి అల్పజ్ఞానం కూడా అంకురించదు. ఒక నదీ ప్రవాహమనేదే లేకపోతే మన పాత్రలలోకి జలం రాగలదా. అలాగే మనమిప్పుడాయా శాస్త్రాలలో కళలలో కృషి చేయగలుగు తున్నామంటే వాటికి సంబంధించిన జ్ఞానం లేకపోతే చేయగలమా. మరి ఈ విశేష