#


Index

పురుషోత్తమ ప్రాప్తి యోగము

  అలాగే సమస్త భూతాలలో ఉన్నా పరమాత్మ చైతన్యం గుప్తంగానే గాని అంతగా ప్రకటమయి కనిపించదు. ఒక్క మానవుడి బుద్ధిలోనే అది ప్రకటమయి కనిపిస్తుంది. అందులోనూ బుద్ధి నిర్మలమయ్యే కొద్దీ బాగా బయటపడి ప్రకాశిస్తుంది. కనుకనే ఇప్పుడర్థ మవుతుంది మనకొక సత్యం నత ద్భాసయతే సూర్యః న శశాంకోన పావకః సూర్యచంద్రాదులేవీ దాన్ని ప్రకాశింప జేయలేవని ముందు చెప్పి యదాదిత్యగతం తేజః తత్తేజోవిద్ధి మామకం సూర్య చంద్రాదుల ద్వారా వాస్తవంలో ప్రకాశిస్తున్నది నేనేనంటాడు. అంటే ఏమని భావం. సూర్యాదులు జడపదార్థాలు. జడమైనవి చైతన్యాన్ని చూడలేవు చూపలేవు. చైతన్యమే ఎప్పటికైనా జడ ప్రపంచాన్ని చూపవలసి ఉంటుంది. సూర్యచంద్రాదులేవీ స్వతహాగా ప్రకాశించడంలేదని మీదు మిక్కిలి వాటినే నేను ప్రకాశింపజేస్తున్నానని పేర్కొనటంలో ఇదీ అంతరార్థం. ఉపనిషత్తు కూడా ఇదే మాట చెబుతున్నది. యం పృథివీన వేద యమాదిత్యోనవేద చంద్రమాన వేద. తమలో వచ్చి కూచున్న అంతర్యామిని తామేమాత్రమూ తెలుసుకోలేక పోతున్నాయి వృథివ్యాదులు. యః పృథివ్యా మంతరో యమయతి. మీదు మిక్కిలి అదే వీటిలో కూచొని తన చైతన్యశక్తితో వీటిని నడుపుతున్నదట.

  అయితే మానవుడి బుద్ధిలో వచ్చి కూచున్నదని చెబుతున్నారుగదా ఇప్పుడా చైతన్యం. దీని సంగతేమిటి. ఇది చేతనమే గదా ఈ బుద్ధి. ఇది

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు