#


Index

పురుషోత్తమ ప్రాప్తి యోగము

వ్యవహారాస్పదత్వంచ. అది జీవ జగదీశ్వరులనే భావాలన్నిటికీ స్వరూపమే. ఏవీ దానికి వేరుగా తమ పాటికి తాము లేవు. అంత వరకూ వాస్తవమే అయితే మరి ఈ భేదమెలా ఏర్పడిందంటారా. ఇది కేవలం వ్యవహారం మాత్రమే. ఈ వ్యవహారమంతా ఏదోగాదు మరలా. దాని వ్యవహారమే Transaction. అదే దీనికాస్పదం. అధిష్ఠానం. ఇదంతా దానిమీద అధ్యారోపితం. కల్పితం. అదే ఈ జీవ జగదాది రూపంగా భాసిస్తున్నది. అందుకే ఆ భాస అన్నారు దీన్ని. ఆ మాటకువస్తే విభూతి అనికూడా అన్నారు. ఒక బంగారమనేదే ఆభరణాలుగా భాసిల్లుతున్నట్టు. అవి ఏమిటా అని చూస్తే మరలా బంగారమే అయినట్టు ఇది కూడా అంతే. స్వరూప విభూతులు రెండూ ఒకటే. ఒకే తత్త్వం బొమ్మబొరుసులాగా స్వరూపంగా చూస్తే స్వరూపం. విభూతిగా చూస్తే విభూతి. ఎటువచ్చీ స్వరూపాన్ని మరచి చూస్తేనే ప్రమాదం. స్వరూపమే ఇదంతా అనే దృష్టి వదలకుండా దాని విభూతిని దర్శించటం నేర్చుకోవాలి. అదీ క్రొత్తగా కాదు. ఉన్నదే గుర్తుచేసుకోవాలి. అంతమాత్రమే సాధన అనేది కూడా. అంచేత ఎందుకా ఇలా జరిగింది. దీన్ని ఎలాగా తప్పించుకోటమని గాబరా పడరాదు. బాహ్యంగా ఏపనీ చేయనక్కరలేదు. మానసికంగా దృష్టిమార్చుకోటమే. మామూలుగా చూస్తే పరమాత్మకాదిది ప్రపంచం. మార్చుకొని చూస్తే ప్రపంచం కాదిది పరమాత్మ. దృష్టిలోనే భేదం. సృష్టిలో లేదు. సృష్టిఅంతా ఆత్మ స్వరూపమే. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఇది ఆత్మే. అనాత్మ అసలు

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు