#


Index

పురుషోత్తమ ప్రాప్తి యోగము

  అయితే ఒక ఆశంశ మనకిక్కడ. శాస్త్రమెంత నచ్చజెబుతున్నా భావుకుడైన వాడికి సంతృప్తి కలగటంలేదు. అదేమిటంటే పరమాత్మే ఈ మొత్తం ప్రపంచానికి స్వరూపమన్నారు. జీవుడేమిటి జగత్తేమిటి ఈశ్వరుడేమిటి. ఎవరికి వారు విడిగా ఎక్కడా లేరు. ముగ్గురూ పరమాత్మ స్వరూపమే. అదే వాస్తవ మయినప్పుడు ఇక ఈ జీవుడేమిటి సంసారమేమిటి ఈ సంసారజీవులు తప్పించుకోటానికి ప్రయత్నమేమిటి. అందులో కొందరు మాత్రమే తరించి కృతార్థులుకావటం మిగతా జనబాహుళ్యం లేకపోవట మేమిటి. అసలా పరమాత్మకీ పక్షపాతమేమిటి. అంతా అయోమయంగా ఉంది. దీనికేమిటి సమాధానమని ప్రశ్న. ఇది భగవత్పాదులకే వచ్చి ఇప్పుడవతారిక వ్రాస్తున్నారు మరలా. చూడండి.

  యత్పదం సర్వస్యావభాసకమపి అగ్న్యాదిత్యాదికం జ్యోతిర్నావ భాసయతే. ఏది అన్నింటినీ వెలిగించే సూర్యచంద్రాది జ్యోతులు కూడా వెలిగించలేవో. యత్రాప్తాశ్చముముక్షవః పునస్సంసారాభిముఖా ననివర్తంతే ఏ ధామం చేరితే ముముక్షువులైన వారు మరలా సంసారాభిముఖంగా తిరిగిరారో. యస్యచ పదస్య ఉపాధి భేద మను విధీయమానా జీవా ఘటాకాశాదయ ఇవాకాశస్య అంశాః దేని ఉపాధి భేదాన్ని బట్టి ఆకాశానికి ఘటాకాశాల లాగా ఈ జీవులందరూ అంశలయి కూచున్నారో. తస్యపదస్య ఆ పరతత్వ మేమిటను కొంటున్నారో మీరు. సర్వాత్మత్వం సర్వ

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు