#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

శరీరాలలోనూ వ్యాపించి ప్రతి ఒక్కదానిలో కూచొని ఇవన్నీ నా శరీరాలేనని దర్శించగలిగి ఉండాలి. అలాటి సర్వవ్యాపకుడైన వాణ్ణి మేము క్షేత్రజ్ఞుడని పేర్కొంటున్నది. ఇలాటి జ్ఞాన మౌపదేశికమే గాని స్వాభావికం కాదు. కాదని ఎవరూ చెప్ప బని లేదు. మనకందరికీ ఇప్పుడున్న అనుభవమే ప్రమాణం. ఎవరి శరీరంలో వాళ్ళ మున్నామని భావిస్తున్నామే గాని మనమంతా అన్ని శరీరాల్లో వ్యాపించి ఉన్నామని అనుకోగలుగు తున్నామా. అలా వ్యాపించగలిగితే ఎవడి శరీరంతో వాడు తాదాత్మ్యమెలా చెందగలడు. తాదాత్మ్యమంటే ఏమిటి. అదే నేనని దానితో ముడిబడి ఆ ముడి విప్పుకోలేని దుః స్థితి. దానికే గ్రంధి అని పేరు పెట్టారు వేదాంతులు. గ్రంధి అంటే ముడి అనే అర్థం. ఇలా ఒక శరీరంలో ముడిపడ్డదే ఆమేరకు పరిమితమైనదే ఇప్పుడు మనకున్న జ్ఞానం. దీనినే స్వాభావికమన్నారు భాష్యకారులు. దీనివల్ల మనం క్షేత్రజ్ఞులమైనా ఎవడి క్షేత్రం మేరకు వాడే క్షేత్రజ్ఞుడు. అది దాటి అన్ని క్షేత్రాలలో ప్రవేశించే సామర్ధ్యం లేదు మనకు. ఉంటే అది స్వాభావికం గాదా జ్ఞానం. ఔపదేశికం.

  స్వభావమంటే ప్రకృతి. అది త్రిగుణాత్మకం గనుక త్రిగుణాత్మకమైన ఈ శరీరమే నీదని చూపుతున్నది. కనుక స్వాభావికమైనదీ జ్ఞానం. దీనివల్ల ఈ మేరకే నేను నాది అని భావించి ఆమేరకే క్షేత్రజ్ఞుల మయ్యాము మనమంతా. విస్తరించి అన్ని క్షేత్రాలూ నావని చూడలేకపోతున్నాము. అలా చూడాలంటే ఈ శరీరంతో ముడిపడ్డ నా జ్ఞానాన్ని విడగొట్టుకొని ఇందులో నుంచి బయటపడాలి. పడితే గాని విస్తరించలేము. విస్తరిస్తే