#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

జ్ఞానం మాత్రమే అయి తీరాలి. ఇదుగో ఈ జ్ఞానం మాత్రమే తన స్వరూపమని గుర్తించి ఇది నాకు జ్ఞేయ మీ శరీరమనే వివేచన చేయగల జ్ఞానమే ఔపదేశిక జ్ఞానం Intutive. ఇందులో ఏదైనా సరే. ఈ శరీరమనే క్షేత్రాన్ని గ్రహిస్తున్నదనే విషయంలో తేడా లేదు. ఇది పెద్దలందరూ చెబుతున్న విషయం. అయితే గ్రహించేంత వరకూ తేడా లేదన్నారు గదా. ఇక స్వాభావికమైతే నేమి జ్ఞానం ఔపదేశికమైతే నేమి. స్వాభావికంగా ఇప్పుడు మనకున్న జ్ఞానంతోనే తృప్తి పడవచ్చు గదా- గురూపదేశం వల్ల వేరే ఒక జ్ఞానం కష్టపడి సంపాదించ వలసిన అవసర మేమిటని ఇప్పుడు ప్రశ్న వచ్చింది. దాని కిస్తున్నది సమాధానమిప్పుడు గీత. ఇది క్షేత్రమని గ్రహిస్తున్నాడంటే ఆ క్షేత్రజ్ఞుడెవ డనుకొంటున్నారు.

క్షేత్రజ్ఞం చాపిమాం విద్ధి - సర్వక్షేత్రేషు భారత
క్షేత్ర క్షేత్రజ్ఞయోః జ్ఞానం యత్తద్ జ్ఞానం మతం మమ - 2

  ఈ క్షేత్రంలో మాత్రమే కూచొని ఇది మాత్రమేనా క్షేత్రమని దర్శిస్తున్నా వాడనుకొంటున్నారా క్షేత్రజ్ఞుడంటే. అలాగైతే అది స్వాభావికమైనదే ఆ జ్ఞానం. ఔపదేశికం కాదు. అది కూడా శరీరానికి విలక్షణంగా తన్ను భావించి కాదు. శరీరం తో తాదాత్మ్యం చెంది అది వదలకుండా శరీరం నాదని లోకసామాన్యంగా చూచి వ్యవహరిస్తున్న జ్ఞానం. ఇలాటి జ్ఞానమున్న క్షేత్రజ్ఞుణ్ణి కాదిప్పుడు మేము క్షేత్రజ్ఞుడని పేర్కొనటం. మరి ఎవరినంటారు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు. ఒక్క శరీరంలోనే గాక సమస్త